అయితే ఇలా చేయండి..

Health: గురక సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. గురక వారికి మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్నవారికి కూడా సమస్య. నిద్రకు అంతరాయం ఏర్పడటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

మీరు నిద్రపోయే విధానం గురకకు కారణం కావచ్చు. స్ట్రైట్ గా పడుకోవడం వల్ల గురక వస్తుంది. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గురక తగ్గుతుంది.

అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ కూడా గురకకు కారణమవుతాయి. శ్వాసనాళాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు, గాలి లోపలికి, బయటికి సరిగ్గా కదలకుండా అడ్డుకున్నప్పుడు గురక వస్తుంది. బరువు తగ్గడం వల్ల గురక తగ్గవచ్చు.

రాత్రిపూట మద్యం సేవించడం, ధూమపానం చేయడం వల్ల గురక వస్తుంది. పడుకునే ముందు వీటిని తీసుకోకూడదు. శరీరంలో నీటి శాతం తగ్గితే, ముక్కు, గొంతు ఎండిపోయి, గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం, డుకునే ముందు వేడి టీ తాగడం వల్ల గురక తగ్గుతుంది.

పడుకునే ముందు ఎక్కువ తినడం వల్ల గురక వస్తుంది. కనీసం 2-3 గంటల ముందు భోజనం ముగించడం మంచిది. మీరు మంచి నిద్ర దినచర్యను అనుసరించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొలపడం అలవాటు చేసుకోవాలి. యోగా, ధ్యానం చేయడం ద్వారా కూడా గురకను తగ్గించుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story