Sugar vs Sweeteners: చక్కెరకు బదులుగా స్వీట్నర్స్ వాడుతున్నారా? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే?
ఎలాంటి ప్రభావం చూపుతాయంటే?

Sugar vs Sweeteners: హెల్త్ కాన్షియస్ అని చెప్పుకునే వారు, షుగర్‌కు ప్రత్యామ్నాయంగా మరికొందరు ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు.ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇవి పూర్తిగా సేఫ్ అని భావించి రోజుకు నాలుగైదు కప్పుల టీ, కాఫీల్లో కలుపుతున్నారు.కమర్షియల్ యాడ్స్ ప్రభావంతో టీ, కాఫీల్లోనే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా ఇవే వాడుతున్నారు ఈ మధ్య. కానీ ఇవి ఎంతవరకు సేఫ్ అని అడిగితే న్యూట్రీషనిస్టులు మాత్రం వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ ఈ మధ్య ఫ్యాన్సీ ఇంగ్రెడియంట్‌గా మారాయి.దీనికి ప్రధాన కారణం టీవీల్లో వచ్చే కమర్షియల్ యాడ్స్.ఆ యాడ్స్ చూసి షుగర్ వల్ల నష్టం జరుగుతుందని భయపడి దానికి బదులుగా వీటినే ఎంచుకుంటున్నారు.కానీ ఇది ఒక కెమికల్ మాత్రమే అని న్యూట్రీషనిస్ట్ మనీషా చోప్రా స్పష్టం చేశారు.
డయాబెటిక్ పేషెంట్స్‌లో ఇన్సులిన్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో ఇవి సహాయపడతాయనేది నిజమే.అయినా వీటిని రెగ్యులర్‌గా, రోజూ తీసుకుంటే శరీరానికి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని ఆమె హెచ్చరిస్తున్నారు.
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ స్వీట్నర్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ & ఫార్మకోథెరపుటిక్స్‌లో ప్రచురితమైన ఒక స్టడీ ప్రకారం ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ వల్ల బరువు పెరగడంతో పాటు బ్రెయిన్ ట్యూమర్, బ్లాడర్ క్యాన్సర్ వంటి సమస్యలు రావచ్చని పేర్కొన్నారు.
అందుకే వీటికి బదులు సహజమైన తేనెను ఉపయోగించడం మంచిదని మనీషా చోప్రా సూచిస్తున్నారు.ఇటీవలి అధ్యయనాలు కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఎరిథ్రిటాల్ వంటి స్వీట్నర్స్ మెదడు రక్షణ పొరను దెబ్బతీసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
సుమారు 13 వేల మందిపై జరిపిన ఒక అధ్యయనంలో అధికంగా ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ తీసుకున్నవారిలో మెమరీ, థింకింగ్ స్కిల్స్ 62 శాతం వేగంగా క్షీణించినట్లు తేలింది.ఆస్పర్టమే, సాచరిన్, సుక్రలోజ్, ఎరిథ్రిటాల్ వంటి ఆరు స్వీట్నర్స్‌కు ఈ సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
గట్ బాక్టీరియాలపై ప్రభావం చూపి జీర్ణ సమస్యలు, బ్లోటింగ్, డయేరియా వంటివి కూడా కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు. హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాలతో కూడా దీర్ఘకాలిక వాడకం ముడిపడి ఉందని కొన్ని అబ్జర్వేషనల్ స్టడీలు సూచిస్తున్నాయి.
బరువు తగ్గడానికి వీటిని వాడితే బదులుగా క్రేవింగ్స్ పెరిగి బరువు పెరగవచ్చని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా బరువు నియంత్రణకు నాన్-షుగర్ స్వీట్నర్స్‌ను సిఫారసు చేయదు. కాబట్టి రోజువారీగా ఎక్కువగా వాడకం చేయకుండా, అవసరమైతే మాత్రమే తక్కువ మోతాదులో ఉపయోగించాలని నిపుణుల సలహా.
సహజ ఆహారాలు, తేనె, పండ్లు వంటివాటి వైపు మళ్లడం మంచిది.ఆరోగ్యం కోసం షుగర్ తగ్గించుకుంటూ కెమికల్ స్వీట్నర్స్‌పై ఆధారపడకుండా సమతుల్య ఆహారం తీసుకోవడమే ఉత్తమ మార్గం.

