Summer Alert: ఎండ తీవ్రత వల్ల పిల్లలు త్వరగా చెమట రూపంలో శరీరంలోని ద్రవాలను కోల్పోతారు. చిన్న పిల్లలు, శిశువులు తమ దాహాన్ని సరిగ్గా వ్యక్తపరచలేరు కాబట్టి, తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం చాలా అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గుర్తించాల్సిన లక్షణాలు:

పిల్లల్లో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వారు నిర్జలీకరణానికి గురైనట్లు గుర్తించాలి..

నోరు, పెదవులు పొడిబారడం.

మూత్రవిసర్జన తగ్గడం (తక్కువ సార్లు వెళ్లడం).

*వనీరసం, చిరాకు లేదా తల తిరగడం.

నిపుణుల సలహాలు - తల్లిదండ్రులకు సూచనలు

నీటి లభ్యత

పిల్లలకు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. స్కూల్ బ్యాగ్, బెడ్ పక్కన, ఆడుకునే చోట వాటర్ బాటిల్స్ ఉంచండి. పిల్లలు ఆసక్తిగా నీరు తాగేందుకు రంగురంగుల బాటిళ్లు లేదా స్ట్రాలను వాడవచ్చు. అయితే, ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ లేదా గాజు బాటిళ్లను వాడటం ఉత్తమం.

క్రమం తప్పకుండా నీరు తాగించాలి

దాహం వేసినప్పుడే కాకుండా, ప్రతి 30 నుండి 60 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగేలా పిల్లలను ప్రోత్సహించాలి.

ఆహారంలో మార్పులు

పుచ్చకాయ, నారింజ, దోసకాయ, టమోటాల వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను పిల్లల డైట్‌లో చేర్చాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి సహజ పానీయాలు ఇవ్వాలి. షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉంచాలి.

ఎండవేళల్లో బయట వద్దు

ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలను ఆరుబయట ఆటలకు పంపకుండా, ఇంటి లోపల లేదా నీడ ఉన్న ప్రదేశాల్లోనే ఉంచడం మంచిది.

సరైన దుస్తులు:

శరీరానికి గాలి తగిలేలా, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరింపజేయాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

శిశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ:

పాలు తాగే శిశువులకు తల్లిపాలు లేదా ఫార్ములా పాలను క్రమం తప్పకుండా పట్టించాలి. వారిలో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవిలో కూడా పిల్లల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచవచ్చు. పిల్లల్లో అధిక నీరసం కనిపిస్తే ఆలస్యం చేయకుండా చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి, ద్రవ పదార్థాలు అందిస్తూ వైద్య సలహా తీసుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story