ఇవి సూపర్ ఫుడ్స్

Superfoods for Better Gut Health: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన పొట్ట, అంటే జీర్ణవ్యవస్థ (Gat Health) ఎంత బాగుంటే అంత మంచిది. అందుకే మనం తినే ఆహారంలో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది, కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే.. డైట్‌లో ఫైబర్‌ను ఒక్కసారిగా పెంచేయకూడదు. మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తేనే మన పొట్ట దానికి అలవాటు పడుతుంది. అలాగే మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగాలంటే ప్రోబయోటిక్స్ చాలా అవసరం. అందుకే రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు, కిమ్చీ (Kimchi) వంటి పులియబెట్టిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
ఇక మనకు ఇష్టమైన చిలగడదుంపలను ఉడికించి, కాసేపు చల్లార్చిన తర్వాత తింటే అవి పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా కొద్దిగా నెయ్యిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల పేగుల లోపల మృదువుగా ఉండి, విసర్జన సాఫీగా జరుగుతుంది. ఒకవేళ కడుపులో మంటగా అనిపిస్తే కలోంజీ టీ (Kalonji Tea) తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పీచు పదార్థాలు, మంచి బ్యాక్టీరియా ఉండే ఆహారం తీసుకుంటే మన గట్ హెల్త్ అద్భుతంగా ఉంటుంది, తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

