Supplements Women Should Take After 30: 30 ఏళ్ల తర్వాత మహిళలు తీసుకోవాల్సిన సప్లిమెంట్స్: ఏది నిజం? ఏది అవసరం?
ఏది అవసరం?

Supplements Women Should Take After 30: మహిళలకు 30 ఏళ్లు రాగానే, వారి శరీరంలో పోషకాహార అవసరాలతో పాటు ప్రత్యుత్పత్తి, ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలు మారుతుంటాయి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన ఆహారం ఎప్పుడూ ముఖ్యమే అయినప్పటికీ, కొన్నిసార్లు ఆరోగ్య అవసరాలను బట్టి సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది.
ప్రముఖ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. నేటి యువతలో పోషకాహార లోపాలు చాలా ఎక్కువయ్యాయి. అయితే, ఆహారానికి ఎప్పుడూ సప్లిమెంట్స్ ప్రత్యామ్నాయం కాకూడదని, కేవలం అవసరమున్నప్పుడే వాటిని వాడాలని చెబుతున్నారు.
విటమిన్ డి (Vitamin D):
మన దేశంలో విటమిన్ డి లోపం చాలా సాధారణం. సరిగ్గా ఎండ తగలకపోవడం, వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే, ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఇది మారుతుంది.విటమిన్ డి దీనిని మోతాదుకు మించి తీసుకుంటే హాని కలుగుతుందని, అందుకే ముందుగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
విటమిన్ బి12 (Vitamin B12):
శాకాహారులు ఎక్కువగా విటమిన్ బి12 లోపంతో బాధపడుతుంటారు. కాబట్టి శాకాహార మహిళలు తమ విటమిన్ బి12 అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరిస్తున్నారు.
ఐరన్ (Iron):
రుతుసమయంలో తీవ్రమైన రక్తస్రావం అయ్యే మహిళలకు ఐరన్ చాలా ముఖ్యం. పోషకాహార లోపాలను సరిదిద్దడానికి ఐరన్ సప్లిమెంట్లను సూచిస్తున్నారు. అయితే ఎవరికి వారుగా కాకుండా, వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి వీటిని తీసుకోవాలి.
కాల్షియం (Calcium): తగినంత కాల్షియం అందని లాక్టో-శాకాహారులు దీనిని తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి 30 ఏళ్లు దాటగానే ప్రతి ఒక్కరూ దీనిని రోజూ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రెగ్నెన్సీ ,సంతానోత్పత్తి కోసం
ఫాలిక్ యాసిడ్ (Folic Acid): గర్భం దాల్చాలనుకునే మహిళలకు ఇది ఎంతో ముఖ్యం. ఇది గర్భధారణ రేటును పెంచకపోయినా, పుట్టబోయే బిడ్డలో నాటల్ ట్యూబ్ లోపాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
పిసిఓఎస్ (PCOS) ఉన్నవారికి ఇనోసిటాల్స్ (Inositols): PCOS ఉన్న మహిళల్లో అండోత్సర్గము (ovulation), జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇనోసిటాల్స్ బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. అయితే ఇది అందరికీ వర్తించదు.
కోఎంజైమ్ క్యూ10 (Coenzyme Q10): అండాశయ నిల్వలు (ovarian reserve) తగ్గుతున్నాయనే ఆందోళన ఉన్నప్పుడు, ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించి దీని గురించి ఆలోచించవచ్చు.సమతుల్యమైన ఆహారం తీసుకునే ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఇవి అవసరం లేదు. కేవలం అవసరం లేకపోయినా వీటిని వాడితే అనవసర ఖర్చే తప్ప ప్రయోజనం ఉండదు.
చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే.. 30 ఏళ్ల తర్వాత అందరికీ సరిపోయే ఒకే రకమైన సప్లిమెంట్ రొటీన్ అంటూ ఏదీ లేదు. రక్త పరీక్షలు, ఆహారపు అలవాట్లు, వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ఎంచుకోవాలి.

