నిపుణులు ఏమంటున్నారో తెలుసా..?

Sweating While Eating: చాలామందికి వేడి వేడి ఆహారం లేదా ఘాటైన మసాలా పదార్థాలు తిన్నప్పుడు నుదిటిపై కొద్దిగా చెమట పట్టడం సహజం. అయితే, చల్లని పదార్థాలు తిన్నా లేదా చలికాలంలో కూడా భోజనం చేసేటప్పుడు విపరీతంగా చెమటలు పడుతుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటి ఈ గస్టేటరీ చెమట?

ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ హిమాన్షు భదాని కథనం ప్రకారం.. భోజనం చేసేటప్పుడు చెమట పట్టే సమస్యను వైద్య పరిభాషలో గస్టేటరీ స్వెటింగ్ అని పిలుస్తారు. ఇది కేవలం వేడి వల్ల మాత్రమే కాకుండా శరీరంలోని కొన్ని అంతర్గత మార్పుల వల్ల కూడా సంభవించవచ్చు.

మధుమేహం యొక్క ముందస్తు సంకేతమా?

భోజనం చేసే సమయంలో చెమట పట్టడం అనేది మధుమేహం యొక్క ప్రారంభ లక్షణాలలో ఒకటి కావచ్చు. డయాబెటిస్ వల్ల శరీరంలోని నరాలు దెబ్బతినే అవకాశం ఉంది . ఇలా నరాలు దెబ్బతిన్నప్పుడు ఆహారం తీసుకునే సమయంలో చెమట గ్రంధులు అతిగా స్పందిస్తాయి.అయితే, ఇది కేవలం డయాబెటిస్ వల్లే కాకుండా.. థైరాయిడ్ సమస్యలు లేదా శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.

పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుందా?

పెద్దల మాదిరిగానే పిల్లల్లో కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. సాధారణంగా కారంగా ఉండే ఆహారం తిన్నప్పుడు వారి శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట పట్టడం సహజం .కానీ సాదా ఆహారం తిన్నా చెమట పట్టడం, దాంతో పాటు వేగంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే పీడియాట్రిషియన్‌ను సంప్రదించడం మంచిది.

నివారణ మార్గాలు - చిట్కాలు

ఈ సమస్యను నియంత్రించడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు:

మసాలాలు తగ్గించండి: ఆహారంలో అతిగా కారం, మసాలాలు ఉండకుండా చూసుకోవాలి.

ఒత్తిడిని తగ్గించుకోండి:*

మానసిక ఒత్తిడి కూడా చెమట పట్టడానికి ఒక కారణం కావచ్చు.

నీరు ఎక్కువగా తాగాలి: రోజుకు కనీసం 7 నుండి 8 గ్లాసుల నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.

వైద్య పరీక్షలు: సమస్య పదేపదే వేధిస్తుంటే షుగర్ లెవల్స్, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story