Gas Tablets Every Day: నేటి ఆధునిక జీవనశైలి, వేళాపాళ లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది యాసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి తక్షణ ఉపశమనం కోసం వైద్యుల సలహా లేకుండానే, సొంతంగా రోజూ గ్యాస్ మాత్రలు మింగేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే ఇలా ప్రతిరోజూ యాసిడిటీ టాబ్లెట్లు వాడటం వల్ల శరీరానికి జరిగే ఒక పెద్ద నష్టం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ దాగి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటి?

నిరంతరం గ్యాస్ మాత్రలు వాడటం వల్ల శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.

యాసిడ్ పాత్ర:

మన కడుపులో సహజంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్, మనం తినే ఆహారం నుండి విటమిన్ బి12ను శరీరం గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మాత్రల ప్రభావం:

మనం రోజూ వేసుకునే యాసిడిటీ మాత్రలు కడుపులో యాసిడ్ శాతాన్ని బాగా తగ్గించేస్తాయి. దీనివల్ల శరీరం ఆహారంలోని విటమిన్ బి12ను సరిగ్గా శోషించుకోలేదు.

విటమిన్ బి12 లోపిస్తే వచ్చే సమస్యలు..

శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు పడిపోతే కేవలం జీర్ణక్రియే కాదు, మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా కనిపించే లక్షణాలు..

తీవ్రమైన అలసట: రోజంతా నీరసంగా, ఏ పని చేయలేనట్లుగా అనిపించడం.

నరాల బలహీనత:

కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, సూదులతో పొడిచినట్లు ఉండటం.

రక్తహీనత : శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవడం.

జ్ఞాపకశక్తి తగ్గడం:

మానసిక గందరగోళం, ఏకాగ్రత లోపించడం, మతిమరుపు.

నిపుణుల సూచనలు..

"గ్యాస్ మాత్రలు అనేవి తాత్కాలిక ఉపశమనం కోసమే కానీ, వాటిని జీవితకాలం వాడకూడదు. యాసిడిటీ తగ్గించుకోవడానికి మాత్రలపై ఆధారపడటం కంటే జీవనశైలిని మార్చుకోవడమే ఉత్తమ మార్గం."

సొంత వైద్యం వద్దు:

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపులకు వెళ్లి గ్యాస్ టాబ్లెట్లు కొని వాడటం ఆపేయండి.

ఆహార నియమాలు:

కారాలు, మసాలాలు, జంక్ ఫుడ్ తగ్గించి.. వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోండి.

వైద్యుడిని సంప్రదించండి:

ఒకవేళ మీరు చాలా కాలంగా ఈ మాత్రలు వాడుతుంటే, ఒకసారి డాక్టర్‌ను కలిసి విటమిన్ బి12 పరీక్ష చేయించుకోవడం మంచిది

PolitEnt Media

PolitEnt Media

Next Story