బచ్చలికూరతో అద్భుత ప్రయోజనాలు

Health Benefits of Bachalakura (Malabar Spinach): బచ్చలి ఆకుల (Spinach) ను 'ఆకుకూరల రారాజు' అని కూడా పిలుస్తారు. ఇది పోషకాల నిధి. ప్రతిరోజూ బచ్చలిని ఆహారంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.బచ్చలి కూరలో విటమిన్లు (A,C,K), ఫోలేట్, ఐరన్, కాల్షియం , మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.

ప్రయోజనాలు

1. రక్తహీనత నివారణ

బచ్చలి కూరలో ఐరన్ (ఇనుము) చాలా అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు రక్తహీనత (Anemia) సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

2. ఎముకల ఆరోగ్యం

ఇందులో విటమిన్ K, కాల్షియం అధికంగా ఉంటాయి. విటమిన్ K ఎముకల గట్టిదనానికి సహాయపడి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. కంటి చూపు మెరుగు

బచ్చలిలో లూటిన్ , జియాక్సంతిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి, కంటి శుక్లాలు వయస్సు సంబంధిత మస్క్యులార్ డిజెనరేషన్ (AMD) వంటి సమస్యల నుండి రక్షిస్తాయి.

4. గుండె ఆరోగ్యం

బచ్చలి కూరలో పొటాషియం ఉంటుంది, ఇది సోడియం (ఉప్పు) యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది.

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి, గుండె జబ్బులు , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. క్యాన్సర్ నివారణ

ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్లోరోఫిల్, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, శరీరంలోని హానికరమైన కణాల పెరుగుదలను నిరోధించడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

6. మెదడు పనితీరు

బచ్చలిలో ఫోలేట్ , విటమిన్ K ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.వయసు పెరిగే కొద్దీ వచ్చే నరాల బలహీనతను నివారిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story