Fennel Seeds: సాధారణంగా మనం ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో భోజనం చేసిన తర్వాత నోరు తాజాగా ఉండటానికి సోంపు గింజలను తింటూ ఉంటాం. చాలా మంది ఇవి కేవలం నోటి దుర్వాసనను పోగొట్టడానికి, తిన్న తిండి అరగడానికి మాత్రమే ఉపయోగపడతాయని అనుకుంటారు. కానీ, ఆ చిన్న సోంపు గింజల్లో మీ ఊహకు అందని ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. రోజూ కొద్దిగా సోంపు గింజలను నమలడం వల్ల మన శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడుతెలుసుకుందాం

సోంపు గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఎంతగానో మెరుగుపరుస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ సోంపు గింజలను నమలడం వల్ల జీర్ణరసాలు బాగా ఊరి, తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఇందులోని ఫైబర్ మలబద్ధకం సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది.

ఇక బరువు తగ్గాలని డైటింగ్ చేసేవారికి సోంపు గింజలు బెస్ట్ ఆప్షన్. ఇవి శరీరంలోని మెటబాలిజాన్ని పెంచి, క్యాలరీలను వేగంగా కరిగించడంలో సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే సోంపు నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, కొవ్వు కరిగిపోతాయి. అలాగే, రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు సోంపులో పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల చర్మంపై మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఇవే కాకుండా, సోంపు గింజల్లో ఉండే పొటాషియం రక్తపోటును అంటే బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కంటి చూపు మందగించిన వారు రోజూ సోంపును తీసుకోవడం వల్ల దృష్టి లోపాలు తొలగిపోతాయి. ఇందులో ఉండే విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్లో కఫం చేరి ఇబ్బంది పడేవారికి, ఆస్తమా రోగులకు కూడా సోంపు ఉపశమనాన్ని ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story