Heart Disease: ఈ అలవాట్లు ఉంటే గుండె జబ్బులు ఖాయం!
గుండె జబ్బులు ఖాయం!

Heart Disease: మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. అది నిరంతరం కొట్టుకుంటూ మనకు ప్రాణవాయువును, శక్తిని అందిస్తుంది. కానీ మారుతున్న కాలంతో పాటు మన జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. అసలు గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం.
1. ఆహారపు అలవాట్లు
మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. అధికంగా నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్, ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె ధమనులలో అడ్డుపడి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.
2. వ్యాయామం లేకపోవడం
గంటల తరబడి కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతాం. ఊబకాయం అనేది గుండె జబ్బులకు ఆహ్వానం పలికినట్లే. రోజూ కనీసం 30 నిమిషాల నడక మన గుండెను పదిలంగా ఉంచుతుంది.
3. అలవాట్లు (ధూమపానం & మద్యపానం):
సిగరెట్ పొగలోని నికోటిన్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది రక్తపోటును పెంచి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తుంది. అలాగే అతిగా మద్యం సేవించడం కూడా గుండె కండరాలను బలహీనపరుస్తుంది.
4. ఒత్తిడి , నిద్రలేమి
ప్రస్తుత పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి (Stress) అందరినీ వేధిస్తోంది. అతిగా ఆందోళన చెందడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి గుండెపై అదనపు భారం పడుతుంది.
5. ఇతర అనారోగ్య సమస్యలు:
డయాబెటిస్ (మధుమేహం) మరియు అధిక రక్తపోటు (B.P) ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. వీటిని నియంత్రణలో ఉంచుకోకపోతే అవి గుండె కణజాలాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి.
కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా గుండె జబ్బులు రావచ్చు. కానీ, మన చేతుల్లో ఉన్న జీవనశైలిని మార్చుకోవడం ద్వారా 80 శాతం గుండె సమస్యలను అరికట్టవచ్చు.

