After Eating – Beware: తిన్న తరువాత ఈ పనులు చేస్తున్నారా.?
ఈ పనులు చేస్తున్నారా.?

After Eating – Beware: ప్రజెంట్ చాలా మంది అన్నం తిన్న తరువాత సిగరెట్ తాగుతారు. కొందరు టీ తాగుతారు.. మరికొంత మంది ఫ్రూట్స్ తింటారు. మరీ ముఖ్యంగా మహిళలైతే డిన్నర్ చేసిన తరువాత స్నానం చేసి బెడ్ ఎక్కుతారు.. అలా చేస్తే మంచినిద్ర సంగతి ఎట్టున్నా.. ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబతున్నారు. అయితే అన్నం తిన్న వెంటనే కొన్ని పనులు చేయొద్దని డాక్టర్లు చెబుతారు. ముఖ్యంగా, భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం, సిగరెట్ తాగడం, ఎక్కువ నీరు తాగడం, పడుకోవడం, వ్యాయామం చేయడం, మరియు చల్లని పానీయాలు తాగడం వంటివి మానుకోవాలి.
అన్నం తిన్న వెంటనే చాలామంది స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, అలసటగా అనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే స్నానం చేయడం వల్ల శరీరంలోని రక్త సరఫరాలో మార్పులు వస్తాయి. దీంతో జీర్ణశక్తి తగ్గుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
పొగ తాగడమే చాలా ప్రమాదకరం. ఇక అన్నం తిన్నాక స్మోకింగ్ చేస్తే ఆ ప్రభావం పదింతలు ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు తిన్న వెంటనే ఏ పండు తీసుకోవడం కూడా మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. పండ్లు తినడం వల్ల అసిడిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. తిన్న వెంటనే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాస్త అటూ ఇటూ నడవడం మంచిదంటున్నారు.
