Threat to Children’s Lives: పిల్లల ప్రాణాలకు ముప్పు: 'అల్మాంట్-కిడ్' సిరప్‌పై నిషేధం.. వాడొద్దని అధికారుల హెచ్చరిక!
వాడొద్దని అధికారుల హెచ్చరిక!

Threat to Children’s Lives: చిన్నపిల్లలకు ఇచ్చే 'అల్మాంట్-కిడ్' సిరప్‌పై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిషేధం విధించారు. బీహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ అనే కంపెనీ తయారు చేసిన ఈ సిరప్‌లో అత్యంత విషపూరితమైన 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ రసాయనం చిన్నారుల శరీరంలోకి చేరితే కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తక్షణమే వాడకం నిలిపివేయాలి: నిషేధిత సిరప్‌కు సంబంధించి అధికారులు 'స్టాప్ యూజ్' నోటీసులు జారీ చేశారు. ప్రజలు ఎవరూ కూడా తమ పిల్లలకు ఈ సిరప్‌ను వాడకూడదని, ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే వెంటనే పక్కన పడేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల యజమానులు ఈ మందు నిల్వలను వెంటనే వెనక్కి పంపాలని, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఒకవేళ మీ వద్ద ఈ సిరప్ ఉన్నా, లేదా ఎవరైనా అమ్ముతున్నట్లు గమనించినా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీని కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969ను అందుబాటులోకి తెచ్చారు. మందులు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతను, బ్యాచ్ నంబర్లను తనిఖీ చేసుకోవాలని వైద్య నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. గతంలో అంతర్జాతీయంగా ఇలాంటి సిరప్‌ల వల్లే పలువురు చిన్నారులు మృతి చెందిన ఘటనలు వెలుగుచూడటంతో, తెలంగాణ అధికారులు ఈ సారి మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టారు.

