Health:నారింజ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను తినడం రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. చాలా మంది ఈ పండు తిని దాన్ని తొక్కను పడేస్తారు. కానీ ఈ తొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇంటిని శుభ్రపరచడానికి, ఇతర పనులకు నారింజ తొక్కను ఉపయోగిస్తారు. కాబట్టి నారింజ తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

ఆరెంజ్ పీల్ పౌడర్ సహజమైన స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఆరెంజ్ పీల్ పౌడర్‌ని తయారు చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసి చర్మానికి పెట్టుకోవాలి. దీన్ని వల్ల చర్మం మెరుస్తుంది.

ఆరెంజ్ తొక్కలో ఆమ్ల గుణాలు ఉన్నాయి. ఇది వంట మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే నారింజ తొక్క సహజ సువాసనలను కలిగి ఉంటుంది కాబట్టి, ఇది ఇంటిని సువాసనగా మారుస్తుంది.

ఆరెంజ్ తొక్క బాగా ఆరిన తర్వాత పొడి చేయాలి. దీంతో టీ, కషాయాలను చేసుకుని త్రాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నారింజ తొక్కలోని పోషకాలు మొక్కలకు ఎరువుగా పనిచేస్తాయి. దీని బెరడును ఎండబెట్టి మెత్తగా చేసి మట్టితో కలిపి మొక్కలకు పూయాలి. ఇది మీ మొక్కలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story