✕
చిట్కాలు..

x
Health:తలనొప్పి వస్తే ఎంత ఇబ్బంది అవుతోంది అందరికీ తెలిసిందే..ఏ పనిచేయబుద్ధికాదు..ఏమీ తోచదు .దిమాక్ ఖరాబ్ అవుతోంది. అయితే రోజువారి పనులతో చికాకు, తలనొప్పి రావడం కామనే. తలనొప్పి వచ్చినప్పుడు రిలీఫ్ పొందేందుకు తీసుకోవలసిన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం.
తలనొప్పికి మన భావోద్వేగాలతో సంబంధం ఉంది. అందుకే తలనొప్పి మొదలవగానే ఆలోచించడం మానేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి.
శరీరానికి సరిపడా నీళ్లు అందకపోయినా తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పికి ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగండి
ఐస్ ముక్కలను గుడ్డలో చుట్టి తలచుట్టూ ఆడిస్తే క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది.
గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కున్నా రిలీఫ్ ఉంటుంది
మాడు, కణతల మీద మృదువుగా మర్దన చేసినా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొండి తలనొప్పి మటుమాయం అవుతుంది.

PolitEnt Media
Next Story