ఇవి తప్పకుండా తెలుసుకోండి

Using Sunscreen: చర్మాన్ని కాపాడుకోవడానికి చాలా మంది సన్ స్క్రీన్లు వాడుతుంటారు.అయితే సన్‌స్క్రీన్లలో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ లేకుండా చూసుకోవాలి. లేబుల్స్‌పై ఫ్రాగ్రెన్స్ అని ఉంటే థాలేట్స్, పారాబెన్స్ ఉంటే కొనకపోవడమే మంచిదని, ఇవి హార్మోన్లను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు . సన్‌స్క్రీన్ కొనేటప్పుడు మీరు తప్పనిసరిగా గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు

1. SPF (Sun Protection Factor) ఎంత ఉండాలి?

SPF అనేది సూర్యుడి నుండి వచ్చే UVB కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది.సాధారణంగా భారతీయ వాతావరణానికి SPF 30 నుండి SPF 50 మధ్య ఉన్నది ఎంచుకోవడం ఉత్తమం.

మీరు ఎక్కువసేపు ఎండలో ఉండేవారైతే SPF 50 ప్రిఫర్ చేయండి.

2. పీఏ రేటింగ్ గమనించండి

SPF కేవలం UVB కిరణాల నుండే రక్షిస్తుంది, కానీ చర్మం ముడతలు పడటానికి కారణమయ్యే UVA కిరణాల నుండి రక్షణ పొందాలంటే PA రేటింగ్ చూడాలి.

కనీసం PA+++ లేదా PA++++ ఉన్న సన్‌స్క్రీన్ కొంటే అది చర్మానికి మంచి రక్షణ ఇస్తుంది. దీనినే బ్రాడ్ స్ప్రెక్టమ్ అని కూడా అంటారు.

3. మీ చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోండి

మీ స్కిన్ టైప్‌కు సరిపడని సన్‌స్క్రీన్ వాడితే మొటిమలు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

ఆయిలీ స్కిన్ (జిడ్డు చర్మం): 'Gel-based' లేదా 'Matte finish' సన్‌స్క్రీన్ తీసుకోండి. ఇవి జిడ్డుగా అనిపించవు.

డ్రై స్కిన్ (పొడి చర్మం): Cream-based' లేదా మాయిశ్చరైజర్ ఉన్న సన్‌స్క్రీన్ ఎంచుకోండి.

సెన్సిటివ్ స్కిన్: సువాసన లేని, పారాబెన్ రహిత ఉత్పత్తులను వాడండి.

4. ఫిజికల్ vs కెమికల్ సన్‌స్క్రీన్

ఫిజికల్ : ఇందులో జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉంటాయి. ఇది చర్మంపై ఒక పొరలా ఉండి కిరణాలను అడ్డుకుంటుంది. పిల్లలకు మరియు సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇది మంచిది.

కెమికల్ : ఇది చర్మంలోకి ఇంకిపోయి కిరణాలను గ్రహిస్తుంది. ఇది రాసుకున్నప్పుడు తెల్లటి పొర (White cast) కనిపించదు.

5. నీటిలో తడిస్తే పోతుందా?

మీరు ఎక్కువగా చెమట పట్టేవారైతే లేదా ఈత (Swimming) కొట్టే అలవాటు ఉంటే, "Water Resistant" అని రాసి ఉన్న సన్‌స్క్రీన్ మాత్రమే తీసుకోండి. ఇది నీటిలో 40 నుండి 80 నిమిషాల వరకు పనిచేస్తుంది.

కొన్ని ముఖ్యమైన చిట్కాలు

ఎండలోకి వెళ్లే 20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్ రాసుకోవాలి.

ముఖం,మెడ కోసం కనీసం 'రెండు వేళ్ల పరిమాణంలో క్రీమ్ వాడాలి.

ప్రతి 2-3 గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ను మళ్లీ రాసుకోవడం వల్ల పూర్తి రక్షణ లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story