Vision Getting Weaker at a Young Age: ప్రస్తుత డిజిటల్ యుగంలో కంటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే కంటిచూపు లోపాలు, ఇప్పుడు చిన్న వయసులోనే బయటపడుతున్నాయి. కళ్ల అలసట, మంటలు, ఎరుపుదనం, చూపు మసకబారడం వంటి లక్షణాలు సర్వసాధారణంగా మారాయి. మనం రోజూ చేసే కొన్ని చిన్నపాటి తప్పుడు అలవాట్లే చిన్న వయసులోనే దృష్టి లోపాలకు దారితీస్తున్నాయి. కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే 5 ప్రధాన రోజువారీ అలవాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం..

తక్కువగా నీరు తాగడం

రోజుకు 2 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోనే కాకుండా కళ్లలోని తేమ శాతం క్రమంగా తగ్గిపోతుంది. కళ్లలో పొడిబారడం, ఎరుపుదనం, అలసట, చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తాయి.

చిట్కా:

రోజంతా సరిపడా మంచినీరు తాగుతూ శరీరాన్ని, కళ్లను ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.

మితిమీరిన స్క్రీన్ టైమ్ - రెప్పలు వేయకపోవడం

మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ స్క్రీన్లను గంటల తరబడి ఏకధాటిగా చూడటం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. సాధారణంగా స్క్రీన్ చూసే సమయంలో కనురెప్పలు వేసే వేగం బాగా తగ్గుతుంది. కంటి కండరాలపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన అలసట వస్తుంది.

చిట్కా: స్క్రీన్‌పై పనిచేసేటప్పుడు క్రమం తప్పకుండా రెప్పలు వేయాలి. ప్రతి 20 నిమిషాలకోసారి స్క్రీన్ నుంచి చూపు పక్కకు తిప్పి కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.

కళ్లను పదే పదే గట్టిగా రుద్దడం

కళ్లలో దురద లేదా నలక పడినట్లు అనిపించినప్పుడు చాలామంది కళ్లను బలంగా రుద్దుతుంటారు. ఇలా తరచూ రుద్దడం వల్ల కంటి బాహ్య రక్షణ పొర అయిన కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది దీర్ఘకాలంలో దృష్టి లోపాలకు దారితీస్తుంది.

చిట్కా: మంట లేదా దురదగా అనిపిస్తే చేతులతో రుద్దకుండా చల్లని నీటితో కడగడం లేదా వైద్యులను సంప్రదించి సరైన ఐ-డ్రాప్స్ వాడటం మంచిది.

చీకట్లో మొబైల్ వాడకం

రాత్రిపూట గదిలో లైట్లు ఆపేసి చీకట్లో ఫోన్ చూడటం కళ్లకు అత్యంత ప్రమాదకరం. చీకట్లో వెలువడే బ్లూ లైట్ నేరుగా రెటీనాపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల కళ్లలో పొడిబారడం, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటివి వస్తాయి.

చిట్కా: పడుకునే ముందు చీకట్లో ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి.

నిద్రలేమి

కంటి కండరాలు రీఛార్జ్ అవ్వడానికి రాత్రిపూట నాణ్యమైన నిద్ర ఎంతో అవసరం. సరైన నిద్ర లేకపోతే కళ్ల కండరాలకు తగిన విశ్రాంతి దొరకక నిరంతర అలసట, ఫోకస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

చిట్కా: ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిరంతర నిద్ర ఉండేలా చూసుకోవాలి

PolitEnt Media

PolitEnt Media

Next Story