Vitamin B12 Deficiency: మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి మరియు డీఎన్ఏ నిర్మాణానికి విటమిన్ B12 అత్యంత కీలకమైన పోషకం. శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారుచేసుకోలేదు. పూర్తిగా తీసుకునే ఆహారం లేదా సప్లిమెంట్లపైనే ఆధారపడాలి. శరీరంలో విటమిన్ B12 లోపం ఏర్పడినప్పుడు శరీరం ముందస్తుగానే కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. ఆ 5 ముఖ్య హెచ్చరిక సంకేతాలు మరియు నివారణ మార్గాలు..

విపరీతమైన అలసట, బలహీనత

శరీరంలో తగినంత విటమిన్ B12 లేనప్పుడు ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా మందగిస్తుంది. దీనివల్ల కొద్దిపాటి పనికే తీవ్రమైన అలసట, నీరసం, శ్వాస సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు

విటమిన్ B12 నరాల రక్షణ పొర అయిన మయెలిన్ ఉత్పత్తికి చాలా అవసరం. దీని లోపం ఏర్పడితే నరాలు దెబ్బతిని కాళ్లు, చేతుల్లో సూదులతో గుచ్చినట్లు అనిపించడం, తిమ్మిర్లు రావడం లేదా స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చర్మం పాలిపోవడం లేదా పసుపు రంగులోకి మారడం

రక్తహీనత కారణంగా చర్మం తన సహజమైన కాంతిని కోల్పోయి పాలిపోయినట్లు లేదా లేత పసుపు రంగులోకి మారుతుంది. ఎర్ర రక్త కణాలు బలహీనపడి విచ్ఛిన్నం కావడం వల్ల బిలిరుబిన్ స్థాయి పెరిగి ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

నోటి పుండ్లు, నాలుక వాపు

విటమిన్ B12 లోపం వల్ల నాలుక వాచి ఎర్రగా మారడం (గ్లోసిటిస్), నాలుకపై ఉండే రుచి మొగ్గలు కనిపించకుండా పోయి నునుపుగా మారడం, తరచూ నోటి పూత (వ రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

జ్ఞాపకశక్తి మందగించడం, మానసిక ఆందోళన

మెదడు పనితీరుపై B12 లోపం నేరుగా ప్రభావం చూపుతుంది. విషయాలను త్వరగా మర్చిపోవడం, ఏకాగ్రత లోపించడం, మూడ్ స్వింగ్స్, తీవ్ర ఆందోళన లేదా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

విటమిన్ B12 పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

పాల ఉత్పత్తులు:

పాలు, పెరుగు, పన్నీర్, చీజ్ తీసుకోవడం వల్ల శాకాహారులకు మంచి మోతాదులో B12 అందుతుంది.

మాంసాహారం - గుడ్లు: గుడ్లు, చేపలు (సాల్మన్, ట్యూనా), చికెన్, మటన్ లివర్‌లో ఈ విటమిన్ అత్యధికంగా లభిస్తుంది.

ఫోర్టిఫైడ్ ఆహారాలు:.

శాకాహారులు ఫోర్టిఫైడ్ సెరల్స్, ఫోర్టిఫైడ్ ప్లాంట్ మిల్క్ లేదా న్యూట్రిషనల్ ఈస్ట్‌ను ఆహారంలో చేర్చుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story