ఈ ఒక్క పండు తింటే చాలు.. సమస్య మాయం

Vitamin B12 Deficiency: ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్యల్లో విటమిన్ B12 లోపం ఒకటి. ముఖ్యంగా మాంసాహారం తినని శాఖాహారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. విపరీతమైన అలసట, మెదడు సరిగా పనిచేయకపోవడం, నాడీ బలహీనత లాంటి పెద్ద సమస్యలకు ఇది దారి తీస్తుంది. అయితే ఈ లోపాన్ని త్వరగా సహజంగా తగ్గించడానికి మన ఇంట్లో ఉండే అరటిపండు ఒక అద్భుతమైన చిట్కా..

అరటిపండులో B12 ఉండదు..కానీ..

చాలామందికి తెలియని విషయం ఏంటంటే... అరటిపండులో విటమిన్ B12 నేరుగా ఉండదు. కానీ ఇది మన శరీరంలో B12 విటమిన్‌ను గ్రహించే శక్తిని అమాంతం పెంచుతుంది. ఎందుకంటే అరటిపండులో పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా, మనం తిన్న ఆహారం నుంచి B12 శోషణను పెంచుతాయి. అంటే మీరు తీసుకునే B12 ఉన్న ఆహారం ఇంకా బాగా పనిచేయడానికి అరటిపండు హెల్ప్ చేస్తుంది.

విటమిన్ B12 లోపం తగ్గాలంటే.. అరటిపండును ఇలా తినండి

B12 లోపాన్ని అధిగమించడానికి అరటిపండును B12 ఎక్కువగా ఉండే ఆహారంతో కలిపి తినాలి. ఇక్కడ రెండు బెస్ట్ పద్ధతులు ఉన్నాయి:

బనానా మిల్క్‌షేక్

పాలు విటమిన్ B12 కి మంచి వనరు అని అందరికీ తెలుసు. అరటిపండును పాలతో కలిపి తాగితే.. B12 లోపం త్వరగా తగ్గుతుంది. బరువు పెరగాలనుకునేవారికి కూడా ఇది చాలా మంచిది.

తయారీ:

అరటిపండు ముక్కలు, పాలు, కొద్దిగా చక్కెర లేదా తేనె వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి.

చల్లగా తాగాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని ఎంజాయ్ చేయండి.

2. అరటిపండు పెరుగు

ప్రతిరోజూ మనం తినే పెరుగులో కూడా విటమిన్ B12 అధికంగా ఉంటుంది. పెరుగును అరటిపండుతో కలిపి తింటే దాని ప్రయోజనాలు డబుల్ అవుతాయి.

తయారీ:

ఒక గిన్నెలో పెరుగును మెత్తగా చేసి, అందులో చిన్నగా తరిగిన అరటిపండు ముక్కలు కలపండి.

ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. .

ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే, విటమిన్ B12 లోపంతో వచ్చే అలసట, నీరసం నుంచి త్వరగా బయటపడవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story