గుండెపోటు, మెదడు సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంది..

Waking Up Frequently at Night: చాలామంది రాత్రిపూట నిద్ర మధ్యలో పదేపదే మేల్కొంటూ ఉంటారు. దీనిని ఒక సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం, నిరంతర నిద్ర భంగం గుండె, మెదడు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట 7 నుండి 8 గంటల నిరంతర నిద్ర లేకపోతే అది విషంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గుండెకు ఎందుకు ప్రమాదకరం?

మనం నిద్రపోతున్నప్పుడు మన గుండె విశ్రాంతి తీసుకుంటుంది, రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. కానీ నిద్రకు పదేపదే అంతరాయం కలిగితే.. :

గుండెపై ఒత్తిడి: రాత్రిపూట 2 నుండి 3 సార్లు మేల్కొనే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30శాతం వరకువవ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. నిద్ర లేకపోవడం వల్ల రక్తనాళాల్లో వాపు ఏర్పడి, అది గుండెపోటుకు దారితీస్తుంది.

అధిక రక్తపోటు: శరీరం తనను తాను రిపేర్ చేసుకునే సమయం దొరకకపోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది.

మెదడుపై ప్రభావం:

రాత్రిపూట తరచుగా మేల్కొనడానికి ప్రధాన కారణం మీ మెదడు నిద్రలో కూడా చురుకుగా ఉండటమే. దీని అర్థం మీరు అధిక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని లేదా ఏదో విషయం గురించి అతిగా ఆలోచిస్తున్నారని సంకేతం. ఇది కాలక్రమేణా జ్ఞాపకశక్తి తగ్గడానికి, ఏకాగ్రత లోపించడానికి కారణమవుతుంది.

ఎవరికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?

స్లీప్ అప్నియా: నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు.

డిజిటల్ వ్యసనం: పడుకునే ముందు గంటల తరబడి మొబైల్ ఫోన్లు లేదా టీవీ చూసే వారు.

ఒత్తిడి: మానసిక ఆందోళనలతో బాధపడేవారు.

ప్రశాంతమైన నిద్ర కోసం చిట్కాలు:

నిద్ర భంగం కలగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి:

డిజిటల్ డిటాక్స్: పడుకునే కనీసం ఒక గంట ముందు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టేయండి.

స్థిరమైన సమయం: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి మేల్కొనేలా షెడ్యూల్ మార్చుకోండి.

కెఫీన్‌కు దూరం: రాత్రి సమయాల్లో టీ, కాఫీ తాగడం పూర్తిగా మానేయండి.

యోగా - ధ్యానం: మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి.

నిద్ర అనేది విలాసం కాదు, అది శరీరానికి అవసరమైన ఇంధనం. ఒకవేళ మీకు నిరంతరం నిద్రలో ఆటంకాలు కలుగుతుంటే, ఆలస్యం చేయకుండా వెంటన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story