Walking Immediately After Meals: చాలా మందికి భోజనం చేసిన వెంటనే నడకకు వెళ్లే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల తిన్నది అరుగుతుందని, బరువు తగ్గుతామని భావిస్తారు. అయితే ఈ విషయంలో మనం చేస్తున్న ఒక చిన్న పొరపాటు ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం భోజనం చేసిన వెంటనే ఆహారాన్ని అరిగించడానికి మన శరీరంలోని రక్త ప్రవాహం అధికంగా జీర్ణవ్యవస్థ వైపు మళ్లుతుంది. ఆ సమయంలో మీరు వేగంగా నడవడం లేదా కఠినమైన పనులు చేయడం వల్ల రక్త ప్రసరణ ఇతర కండరాల వైపు మళ్లుతుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగి.. కడుపు నొప్పి, కడుపులో బరువుగా ఉండటం లేదా అసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి.

నడవాలా? వద్దా? ఏది సరైన మార్గం?

తిన్న వెంటనే వేగంగా నడవడం అస్సలు చేయకూడదు. అయితే 10 నుండి 15 నిమిషాల తర్వాత చాలా నెమ్మదిగా, తీరికగా నడవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు భారీ భోజనం చేసినట్లయితే, కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాతే నడక మొదలుపెట్టడం మంచిది.

ఎంత సేపు నడవాలి?

ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం తర్వాత 10 నుండి 20 నిమిషాలు నెమ్మదిగా నడవడం సరిపోతుంది. గంటల తరబడి లేదా వేగంగా నడవడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి అతిగా శ్రమించవద్దు.

నెమ్మదిగా నడవడం వల్ల కలిగే లాభాలు:

షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తుంది.

గ్యాస్ సమస్యలకు చెక్: జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి.

చురుకుదనం: తిన్న తర్వాత వచ్చే బద్ధకం లేదా నిద్రలేమి పోయి శరీరం ఉత్సాహంగా ఉంటుంది.

బరువు నియంత్రణ: మెటబాలిజం మెరుగుపడి బరువు అదుపులో ఉంటుంది.

Next Story