Stronger Bones: మానవ శరీరంలో ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి మరియు కండరాల పనితీరు సక్రమంగా సాగడానికి కాల్షియం అత్యంత కీలకమైన పోషకం. శరీరంలో కాల్షియం లోపిస్తే కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి, దంత క్షయం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలామంది కాల్షియం అనగానే కేవలం పాలు లేదా పాల ఉత్పత్తుల పైనే ఆధారపడుతుంటారు. అయితే లాక్టోస్ అలర్జీ ఉన్నవారు లేదా పాలు ఇష్టపడని వారికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శాకాహార ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. శరీరంలో కాల్షియం శాతాన్ని సమృద్ధిగా పెంచే 5 ప్రధాన ఆహారాలు ఇక్కడ చూద్దాం

నువ్వులు

నువ్వులు కాల్షియానికి సహజ నిధి లాంటివి. ఒక చెంచా నువ్వులలో దాదాపు ఒక గ్లాసు పాలతో సమానమైన కాల్షియం లభిస్తుంది.

ఎలా తీసుకోవాలి: లడ్డూల రూపంలో, సలాడ్లపై చల్లుకుని లేదా రోజూ ఒక చెంచా వేయించిన నువ్వులను నేరుగా నమిలి తినవచ్చు.

చియా గింజలు

చియా సీడ్స్‌లో కాల్షియంతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఎలా తీసుకోవాలి: రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే స్మూతీలు, జ్యూస్‌లు లేదా నీటిలో కలిపి తాగడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది.

ఆకుకూరలు

పాలకూర, బ్రకోలీ, తోటకూర వంటి ముదురు ఆకుపచ్చని కూరగాయలలో కాల్షియం, విటమిన్-కె, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి.

ఎలా తీసుకోవాలి: సూప్‌లు, కూరలు లేదా తేలికపాటి సలాడ్ల రూపంలో రోజూ డైట్‌లో చేర్చుకోవాలి.

బాదం పప్పు

డ్రై ఫ్రూట్స్‌లో బాదంపప్పు కాల్షియానికి అత్యుత్తమ వనరు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, విటమిన్-ఇ ఎముకలతో పాటు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎలా తీసుకోవాలి:

రోజూ రాత్రి 5-6 బాదం గింజలను నానబెట్టి, ఉదయం తొక్క తీసి తినడం మంచిది.

అంజీర్

ఎండిన అంజీర్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల బలహీనతను తగ్గించి, శరీరాన్ని దృఢంగా ఉంచడంలో తోడ్పడతాయి.

ఎలా తీసుకోవాలి: రోజుకు 2-3 ఎండు అంజీర్లను నానబెట్టి ఉదయాన్నే తింటే జీర్ణక్రియతో పాటు ఎముకల బలం పెరుగుతుంది

Next Story