Boost Immunity: ఇమ్యూనిటీ పెరగాలా? రోజూ ఈ 5 గింజలను మీ డైట్లో చేర్చుకోండి!
మీ డైట్లో చేర్చుకోండి!

Boost Immunity: శరీర రోగ నిరోధక శక్తిని (Immunity) సహజద్ధంగా పెంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 సూపర్ సీడ్స్ గురించి తెలుసుకుందాం.
చియా విత్తనాలు (Chia Seeds): ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్లు , యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. ఇవి శరీరంలో మంటను తగ్గించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడతాయి.
అవిసె గింజలు (Flax Seeds): వీటిలో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) ‘లిగ్నాన్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను నివారించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
గుమ్మడి గింజలు (Pumpkin Seeds): జింక్ (Zinc), మెగ్నీషియం, విటమిన్-ఇ వంటి పోషకాలు గుమ్మడి గింజల్లో మెండుగా ఉంటాయి. ముఖ్యంగా జింక్ శరీరంలో ఇమ్యూన్ సెల్స్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తుంది.
సూర్యకాంతి పువ్వు గింజలు (Sunflower Seeds): విటమిన్-ఇ, సెలెనియం వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో లభిస్తాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడటంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సహకరిస్తాయి.
నువ్వులు (Sesame Seeds / Til): మన సంప్రదాయ వంటకాల్లో వాడే నువ్వులలో జింక్, కాపర్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి

