10 నిమిషాలు ఇలా చేయండి..

Knee Pain: రోజుకు కనీసం ఒక్కసారైనా నడవడం ఆరోగ్యానికి మంచిది. చాలా మంది ఈ అలవాటును అనుసరిస్తున్నారు. కానీ ఆసక్తికరంగా అనిపించే మరో వ్యాయామం గురించి మీకు తెలుసా..? వెనుకకు నడవడం... తమాషా కాదు.. ప్రతిరోజూ పది నిమిషాలు వెనుకకు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని రెట్రో వాకింగ్ అని కూడా అంటారు.

ఇది శరీరంలోని వివిధ కండరాలను బలోపేతం చేయడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెనుకకు నడవడం వల్ల మీ కాళ్లలోని కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శరీర సమతుల్యతను కాపాడుతుంది.

వెనుకకు నడవడానికి అదనపు శ్రద్ధ అవసరం. ఈ నడక మీ మెదడును ఆరోగ్యంగా చేస్తుంది. ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేసేవారికి, న్యూరోప్లాస్టిసిటీ, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడతాయి. 2023 అధ్యయనం ప్రకారం.. వెనుకకు నడవడం వల్ల ప్రజలలో అభిజ్ఞా శక్తి మెరుగుపడుతుంది.

వెనుకకు నడవడం వల్ల శరీరంలోని కేలరీలు ఎక్కువ ఖర్చవుతాయి. ఎందుకంటే ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. జర్నల్ ఆఫ్ బయోమెకానిక్స్‌లో 2017లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ముందుకు నడవడం కంటే వెనుకకు నడవడం వల్ల 40 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

వెనుకకు నడవడం వల్ల మోకాలి నొప్పి తగ్గుతుంది. అందువల్ల ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి ఫిజికల్ థెరపీలో రెట్రో వాకింగ్‌ను సాధారణంగా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది మోకాళ్లలో అత్యంత తీవ్రమైన నొప్పికి కూడా కొంత ఉపశమనం కలిగించేది.

PolitEnt Media

PolitEnt Media

Next Story