మెరుగుపరచడానికి ఏంచేయాలో తెలుసా..?

Blood Circulation in the Body: శరీరంలో ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ చాలా అవసరం. రక్త ప్రసరణ వ్యవస్థ, అంటే హృదయనాళ వ్యవస్థ, శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. గుండె, రక్త నాళాలు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రక్త నాళాలలో ఏదైనా అడ్డంకులు ఏర్పడితే లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోతే రక్త ప్రవాహం ఆగిపోయి, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పికి కారణమవుతుంది. ఈ సమస్యను ఇంట్లో ఎలా పరిష్కరించుకోవాలో నిపుణులు వివరించారు.

రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మార్గాలు

ప్రతి 30 నిమిషాలకు నడవడం : ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటారు. ఇది ధూమపానం లాగే హానికరం. అందుకే ప్రతి 30-40 నిమిషాలకు లేచి కాసేపు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.

శరీరంలో తగినంత నీరు: డీహైడ్రేషన్ రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. సరైన రక్త ప్రవాహం కోసం శరీరంలో నీటి శాతం తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు సరిపడా నీటిని క్రమం తప్పకుండా తాగాలి.

మంచి ఆహారం: మీ ఆహారంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలను చేర్చుకోండి. బీట్‌రూట్, ఆకుకూరలు, నిమ్మ జాతి పండ్లు, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ వంటివి రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

వ్యాయామం: రక్త ప్రసరణను మెరుగుపరచడానికి వ్యాయామం చాలా ముఖ్యం. ముఖ్యంగా, కాళ్ళ వ్యాయామాలు చేయడం వల్ల దూడ కండరాల నుంచి రక్తం నేరుగా గుండెకు ప్రవహిస్తుంది. ఇది శరీర రక్త ప్రసరణను మెరుగుపరచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story