నల్లబడకుండా ఉండాలంటే ఇలా చేయండి..?

Bananas: అరటి పండ్లు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎక్కువగా పండిన, నల్లబడిన అరటిపండ్లను ఎవరూ ఇష్టపడరు. అయితే అరటిపండ్లను ఎక్కువ కాలం తాజాగా, తాజాగా ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అవి త్వరగా నల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ప్లాస్టిక్ కవర్‌తో చుట్టండి:

అరటిపండ్ల నుండి వెలువడే ఎథిలీన్ గ్యాస్ కారణంగా అవి త్వరగా పండుతాయి. ఇది నివారించడానికి, అరటిపండ్ల తొడిమ భాగాన్ని ప్లాస్టిక్ ర్యాప్‌తో గట్టిగా చుట్టండి. దీనివల్ల గ్యాస్ బయటకు వెళ్లడం తగ్గి అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

అరటిపండ్లను వేలాడదీయండి:

అరటిపండ్లను టేబుల్‌పై పెట్టే బదులు, ఒక హుక్‌కు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల అవి నలగకుండా ఉంటాయి. అలాగే, అన్ని వైపుల నుండి గాలి తగిలి త్వరగా పండకుండా ఉంటాయి.

ఇతర పండ్లకు దూరంగా..

ఆపిల్, టమాట వంటి కొన్ని పండ్లు కూడా ఎథిలీన్ గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఈ పండ్లకు దగ్గరగా అరటిపండ్లను ఉంచితే అవి త్వరగా నల్లబడతాయి. కాబట్టి, వాటిని ఇతర పండ్ల నుండి దూరంగా వేరే చోట నిల్వ చేయండి.

పండిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టండి...

అరటిపండ్లు పూర్తిగా పండిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టండి. దీనివల్ల పైన ఉన్న తొక్క నల్లబడినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

కోసిన అరటిపండ్లకు నిమ్మరసం

ముక్కలుగా కోసిన అరటిపండ్లు నల్లబడకుండా ఉండాలంటే, వాటిపై కొద్దిగా నిమ్మరసం లేదా నారింజ రసం పిండండి. దీనివల్ల ఆక్సిడేషన్ ప్రక్రియ తగ్గి అవి నల్లబడకుండా ఉంటాయి. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా అరటిపండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story