Want to Keep Your Heart Healthy: మీ గుండె పదిలంగా ఉండాలా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

Want to Keep Your Heart Healthy: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మనం తినే ఆహారమే మన గుండె ఆరోగ్యానికి పునాది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ డాక్టర్ అజిత్ జైన్ అందించిన సమాచారం ప్రకారం.. గుండెను ప్రమాదంలో నెట్టే ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
గుండెకు శత్రువులైన ఆహారాలు ఇవే:
మనం నిత్యం రుచి కోసం తినే కొన్ని పదార్థాలు గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.
నూనెలో వేయించిన పదార్థాలు:
అధిక నూనెలో వేయించిన ఫుడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారం:
ప్యాక్ చేసిన చిరుతిళ్లు, నిల్వ ఉంచిన ఆహారాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి తెస్తుంది.
చక్కెర - స్వీట్లు: అతిగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది, ఇది నేరుగా గుండెను దెబ్బతీస్తుంది.
ఎర్ర మాంసం :
అధిక కొవ్వు ఉండే మాంసం రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది.
శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు:
మీ ఆహారపు అలవాట్లు సరిగ్గా లేనప్పుడు శరీరం కొన్ని లక్షణాల ద్వారా మీకు ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది..
1. త్వరగా అలసిపోవడం.
2. ఛాతీలో బరువుగా అనిపించడం.
3. మెట్లు ఎక్కినప్పుడు లేదా నడిచినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
4. అకస్మాత్తుగా బరువు పెరగడం, తరచుగా అజీర్ణం కావడం.
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి చిట్కాలు:
ఆరోగ్యకరమైన గుండె కోసం కేవలం ఆహారం మార్చుకుంటే సరిపోదు, జీవనశైలిలోనూ మార్పులు అవసరం.
తినాల్సినవి - చేయాల్సినవి
ఆకుకూరలు, తాజా పండ్లు, ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ, యాసిడ్స్ ఉన్న గింజలు, పప్పుధాన్యాలు తినాలి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం.
వేయించిన నూనెను మళ్లీ వేడి చేసి వాడకూడదు, జంక్ ఫుడ్, బయట దొరికే పానీయాలు. అతిగా ఒత్తిడికి గురవ్వడం. గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం.
ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం వల్ల గుండె జబ్బులే కాకుండా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యతనిచ్చి, ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండెను దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

