Look Beautiful: అందంగా కనిపించాలంటే ఇలా చేయండి
ఇలా చేయండి

Look Beautiful: అందంగా కనిపించాలని కోరుకునే మహిళలకు మేకప్ ఒక ముఖ్యమైన సాధనం. అయితే అధిక మేకప్ ఉత్పత్తులను వాడటం వల్ల ముఖం సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే సహజంగా, అందంగా కనిపించడానికి కొన్ని సులభమైన చిట్కాలను పాటించవచ్చు. ఈ చిట్కాలను అనుసరించడం వల్ల మీ ముఖం మేకప్‌తో కూడా సహజమైన మెరుపును సంతరించుకుంటుంది.
1. చర్మాన్ని సిద్ధం చేయండి:
మొదట, మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. తరువాత, మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండేందుకు ప్రైమర్‌ను ఉపయోగించండి. ప్రైమర్ చర్మాన్ని మృదువుగా చేసి, మేకప్ లుక్‌ను మెరుగుపరుస్తుంది.
2. క్రీమ్, కన్సీలర్‌తో బేస్:
మాయిశ్చరైజర్, ప్రైమర్ తర్వాత మీ చర్మ రకాన్ని బట్టి క్రీమ్‌ను ఎంచుకోండి. చర్మం కాస్త బిగుతుగా ఉన్నవారు BB క్రీమ్‌ను వాడవచ్చు. చేతి లేదా మేకప్ బ్రష్ సహాయంతో క్రీమ్‌ను ముఖంపై సరిగ్గా అప్లై చేయాలి. ముఖంపై మొటిమల మచ్చలు, నల్లటి వలయాలు ఉంటే వాటిని కన్సీలర్‌తో కవర్ చేయవచ్చు. కన్సీలర్‌ను బ్రష్ లేదా స్పాంజ్‌తో ముఖంపై అప్లై చేయండి.
3. సెట్టింగ్ పౌడర్:
ఈ దశలన్నీ పూర్తయ్యాక, మేకప్ చెదిరిపోకుండా ఉండేందుకు సెట్టింగ్ పౌడర్‌తో ముఖాన్ని సెట్ చేయాలి. ఇది మేకప్ పూర్తిస్థాయిలో స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది.
4. హైలైటర్, బ్లష్‌తో మెరుపు:
మేకప్‌కు ఒక సహజమైన మెరుపును తీసుకురావడానికి బ్లష్, హైలైటర్‌లను ఉపయోగించవచ్చు. పౌడర్‌తో సెట్ చేసిన తర్వాత, ముక్కు, కనుబొమ్మల కింద, పెదవులపై హైలైటర్‌తో హైలైట్ చేయండి. ఇది ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.
5. ఐ మేకప్, లిప్‌స్టిక్:
చివరగా ఐషాడో, మస్కారాను ఉపయోగించి కళ్ళను అందంగా తీర్చిదిద్దాలి. ఇది మేకప్‌లో ఒక ముఖ్యమైన భాగం. పెదవులకు లిప్ బామ్ రాసిన తర్వాత, లిప్‌స్టిక్‌తో సరిపోయే లిప్ లైనర్‌ను వాడండి. ఈ చిట్కాలు మీ ముఖానికి సహజమైన, అందమైన రూపాన్ని ఇస్తాయి.
