Want to Lose Weight Without Starving: ఆకలితో అల్లాడిపోకుండా... ఈజీగా బరువు తగ్గే సీక్రెట్ టిప్స్!
సీక్రెట్ టిప్స్!

Want to Lose Weight Without Starving: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య విపరీతమైన ఆకలి. తక్కువ కేలరీలు తీసుకుంటూ రోజంతా ఆకలితో అలమటించాల్సిన పనిలేదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, కడుపు నిండిన భావను పొందుతూనే సులభంగా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనానికి ముందు నీరు తాగండిమొదటి చిట్కా చాలా సింపుల్! మీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని వేగంగా, ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే, భోజనం చేసే ముందు ఒక గ్లాసు నీరు తాగండి. ఇది కడుపు నిండిన భావనను కలిగించి, పరిమాణాన్ని నియంత్రించడంలో (Portion Control) బాగా సహాయపడుతుంది.
రెండవది, మీ భోజనపు ప్లేట్‌ను సమతుల్యంగా సిద్ధం చేసుకోండి. ప్లేట్‌లో ప్రోటీన్, కూరగాయలు, స్టార్చ్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఇక మూడవ చిట్కా ఏంటంటే... భోజనంలో ముందుగా ఫైబర్ ఉండే కూరగాయలను తినాలి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి ఇది గొప్ప మార్గం.
నాల్గవది అత్యంత ముఖ్యమైనది తినే వేగం! చాలామంది ఆహారాన్ని క్షణాల్లో తినేస్తుంటారు. దీనివల్ల కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరేలోపే ఎక్కువ తినేస్తాం. అందుకే ప్రతి భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయించండి. నెమ్మదిగా నమిలి తినడం వల్ల శరీరం తృప్తి చెంది, అతిగా తినడాన్ని అరికట్టవచ్చు. కాబట్టి ఈ చిన్న చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యంగా బరువు తగ్గండి.

