Ways to Beat Depression: జీవితం ఒక పొడవైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎప్పుడు ఎలాంటి మలుపు వస్తుందో ఎవరికీ తెలియదు. మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు కూడా ఉంటాయి. అయితే కొంతమంది చెడు అనుభవాలను మళ్లీ మళ్లీ తలచుకుంటూ ఉంటారు. ఇది యాంగ్జైటీకి దారితీస్తుంది. ఆ యాంగ్జైటీ క్రమంగా డిప్రెషన్‌గా మారుతుంది.

మైల్డ్ లేదా మోడరేట్ డిప్రెషన్ నుంచి బయటపడటం అంత కష్టం కాదు. దీనికి తక్షణం మందులు లేదా డాక్టర్ అవసరం లేదు. పాజిటివ్‌గా ఆలోచించడం, కుటుంబం, స్నేహితుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. లో మూడ్‌లో ఉన్నప్పుడు మన మానసిక స్థితిని మెరుగుపరిచే పనులు చేయాలి.

సంతోషం కలిగించే వ్యక్తులతో మాట్లాడండి. వారి సాన్నిహిత్యం మనసుకు ఓదార్పు ఇస్తుంది. మనసుకు నచ్చిన సినిమా చూడండి. అది కొంత సేపు మనల్ని ఆ ఆలోచనల నుంచి దూరం చేస్తుంది. రూమ్‌లోనే కూర్చుని ఉండకుండా బయటకు వెళ్లండి. ప్రకృతిని ఆస్వాదించండి. చెట్లు, పక్షులు, తెల్లని ఆకాశం చూస్తే మనసు తేలికగా అవుతుంది.

పాత ఫోటో ఆల్బమ్‌లు తీసి చూడండి. అందులో ఎక్కువగా సంతోషకరమైన క్షణాలే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు మనల్ని సానుకూలంగా ఆలోచించేలా చేస్తాయి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే డిప్రెషన్ నుంచి క్రమంగా బయటపడవచ్చు.

అయితే డిప్రెషన్ తీవ్రంగా ఉంటే, ముఖ్యంగా ఆత్మహత్య ధోరణి ఉంటే వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించాలి. స్వయంగా నిర్ణయం తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

జీవితంలోని పరీక్షలను తప్పించుకోవడం సాధ్యం కాదు. కానీ వాటిని ఎదుర్కొని నిలబడటం మన చేతుల్లోనే ఉంది. ప్రతికూల ఆలోచనలకు బదులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మానసిక ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే లో మూడ్ నుంచి త్వరగా బయటపడి సాధారణ జీవితం వైపు అడుగులు వేయవచ్చు.

ప్రతి రోజు కొంత సమయం మనకోసం కేటాయించుకోవాలి. వ్యాయామం చేయడం, సంగీతం వినడం, స్నేహితులతో సమయం గడపడం వంటివి కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. జీవితం మనకు ఇచ్చిన బహుమతి. దాన్ని సానుకూలంగా జీవించడం మన బాధ్యత. డిప్రెషన్‌ను అధిగమించి మళ్లీ నవ్వుతూ జీవించవచ్చు.

Next Story