ఎలాంటి ఫుడ్ తినాలి.?

Iron Deficiency: శరీరంలో ఐరన్ (ఇనుము) లోపం ఉంటే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల నీరసం, అలసట, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
1. మాంసాహారం
శరీరం మాంసాహారంలోని ఐరన్‌ను చాలా త్వరగా గ్రహిస్తుంది.
లివర్ (కాలేయం): ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
రెడ్ మీట్: మేక మాంసం వంటివి.
చేపలు, గుడ్లు: వీటిలో కూడా తగినంత ఐరన్ లభిస్తుంది.
2. శాకాహారం
ఆకుకూరలు: ముఖ్యంగా పాలకూర, తోటకూర, గోంగూర.
పప్పు ధాన్యాలు: పెసలు, మినుములు, శనగలు, రాజ్మా.
నట్స్ & సీడ్స్: బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు.
బెల్లం: పంచదారకు బదులుగా బెల్లం వాడటం వల్ల ఐరన్ పెరుగుతుంది. ముఖ్యంగా నువ్వుల ఉండలు (నువ్వులు + బెల్లం) చాలా మంచిది.
3. పండ్లు , డ్రై ఫ్రూట్స్
ఎండుద్రాక్ష & ఖర్జూరం: రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష లేదా ఖర్జూరం తింటే రక్తం పడుతుంది.
దానిమ్మ: ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి బాగా సహాయపడుతుంది.
అత్తి పండ్లు : వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ముఖ్యమైన చిట్కాలు:
ఐరన్ ఉన్న ఆహారం తిన్నప్పుడు, శరీరం దాన్ని సరిగ్గా గ్రహించాలంటే విటమిన్-C అవసరం. అందుకే భోజనం తర్వాత లేదా భోజనంతో పాటు నిమ్మరసం, ఉసిరికాయ లేదా కమలా పండ్లు తీసుకుంటే ఐరన్ త్వరగా ఒంటబడుతుంది. భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగకూడదు. వీటిలోని 'టానిన్లు' శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయి.

