ముఖానికి అప్లై చేస్తే ఏమవుతుందో తెలుసా..?

Apply Lemon Directly to Your Face: పేస్ సహజమైన అందాన్ని పొందాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులు వాడుతుంటారు. వాటిలో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కానీ నిమ్మకాయను నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా దుష్ప్రభావాలు ఎదురవుతాయి. నిమ్మకాయను చర్మానికి పూసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికి నేరుగా నిమ్మకాయ అప్లై చేయడం వల్ల కలిగే నష్టాలు

నిమ్మకాయలో ఉండే ఆమ్ల గుణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మకాయను నేరుగా ఉపయోగిస్తే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

దురద, మంట: నిమ్మకాయను నేరుగా ముఖానికి పూస్తే చర్మంపై బొబ్బలు, వాపు, దురద, మంట, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలను తేలికగా తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. నిమ్మకాయను శనగపిండి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్, కొబ్బరి నూనె, కలబంద జెల్ వంటి వాటితో కలిపి మాత్రమే ఉపయోగించాలి.

హైపర్‌పిగ్మెంటేషన్‌ : నిమ్మకాయను నేరుగా చర్మానికి అప్లై చేసినప్పుడు, చర్మం మరింత సున్నితంగా మారుతుంది. ఆ సమయంలో సూర్యరశ్మి తగిలితే చర్మం నల్లగా అవుతుంది. అంతేకాకుండా, ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌కు కూడా కారణమవుతుంది.

ముడతలు: నిమ్మకాయలో అధిక ఆమ్లత్వం ఉండటం వల్ల చర్మం pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీనివల్ల చర్మంపై ముడతలు తొందరగా వస్తాయి. అలాగే మొటిమలు, నల్లటి మచ్చల సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది.

సహజమైన ఉత్పత్తులతో అందాన్ని పెంచుకోవాలనుకునేవారు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మకాయను నేరుగా కాకుండా, ఇతర పదార్థాలతో కలిపి వాడటం సురక్షితం. మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించడం అవసరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story