శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

You Quit Sugar for 10 Days: చక్కెరను పూర్తిగా వదిలేయడం అనేది వినడానికి సులభంగా ఉన్నా, ఆచరణలో ఒక పెద్ద సవాలు. కానీ, కేవలం పది రోజుల పాటు ప్రాసెస్ చేసిన చక్కెరను తీసుకోకుండా ఉంటే, మీ శరీరం మీకు థాంక్స్ చెబుతుందని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెర వినియోగం తగ్గించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే:

కాలక్రమేణా శరీరంలో కలిగే మార్పులు:

6వ రోజు: చక్కెర తీసుకోవడం ఆపిన ఆరో రోజు నుంచే మీ జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

7వ రోజు: వారంలోనే మీ మూడ్‌లో సానుకూల మార్పులు వస్తాయి. చక్కెర వల్ల కలిగే హఠాత్తు శక్తి హెచ్చుతగ్గులు తగ్గి, మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది.

10వ రోజు : పది రోజులు పూర్తయ్యేసరికి మీ చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది. మొటిమలు, ముడతలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలలో సానుకూల మార్పులు మొదలవుతాయి.

30వ రోజు : ఒక నెల పాటు చక్కెరకు దూరంగా ఉంటే, శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు తగ్గి, బరువులో గణనీయమైన మార్పును గమనించవచ్చు.

సహజ చక్కెర వర్సెస్ అదనపు చక్కెర

పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులలో ఉండే సహజ సిద్ధమైన చక్కెర ఆరోగ్యానికి హానికరం కాదు. సమస్య అంతా మనం టీ, కాఫీ, స్వీట్లు మరియు కూల్ డ్రింక్స్‌లో అదనంగా కలుపుకునే చక్కెరతోనే వస్తుంది.

ఎవరు ఎంత తినవచ్చు?

ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం:

పెద్దలు: రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు.

చిన్నపిల్లలు (2-3 ఏళ్లు): రోజుకు 14 గ్రాముల కంటే తక్కువ ఉండాలి.

ప్రారంభంలో చక్కెర మానేసినప్పుడు తలనొప్పి, అలసట లేదా చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ, దీర్ఘకాలికంగా చూస్తే ఇది మీ శరీరానికి వ్యాధి రహిత, ఉత్సాహవంతమైన జీవితాన్ని అందిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story