When You Drink Coffee in the Morning: ఉదయాన్నే కాఫీ తాగితే కాలేయానికి ఏం జరుగుతుంది..? డాక్టర్ల షాకింగ్ నిజాలు
డాక్టర్ల షాకింగ్ నిజాలు

When You Drink Coffee in the Morning: చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగడం అలవాటు. అది కేవలం రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికే కాకుండా, కాలేయ ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి కాలేయ రక్షణలో కాఫీ పోషించే కీలక పాత్రను శాస్త్రీయ ఆధారాలతో వివరించారు.
సిర్రోసిస్ ముప్పు 44శాతం తగ్గుతుంది
డాక్టర్ సేథి ప్రకారం, క్రమం తప్పకుండా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం ఏకంగా 44 శాతం వరకు తగ్గుతుంది. దీర్ఘకాలిక మద్యపానం, హెపటైటిస్ బి లేదా సి ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ఫ్యాటీ లివర్ సమస్యల వల్ల కాలేయం పూర్తిగా దెబ్బతినే స్థితిని సిర్రోసిస్ అంటారు. ఈ పరిస్థితిలో కాలేయం సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది. అలాంటి ప్రమాదాన్ని కాఫీ గణనీయంగా అడ్డుకోగలదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
కాలేయ ఎంజైమ్‌లపై సానుకూల ప్రభావం
ఉదయాన్నే కాఫీ తీసుకోవడం వల్ల కాలేయ పనితీరును సూచించే కీలక ఎంజైమ్‌ల స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి ప్రామాణికమైన ALT మరియు AST ఎంజైమ్ స్థాయిలను కాఫీ అదుపులో ఉంచుతుంది. కాలేయంపై పడే రసాయన ఒత్తిడిని తగ్గించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది.
ఫ్యాటీ లివర్‌కు అడ్డుకట్ట
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ముగ్గురు పెద్దలలో ఒకరు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ముదరకుండా అడ్డుకోవడంలో బలమైన వైద్యపరమైన ఆధారాలు ఉన్న అతికొద్ది పానీయాలలో కాఫీ ఒకటని డాక్టర్ సేథి పేర్కొన్నారు.
డీకాఫ్ కాఫీతోనూ ప్రయోజనమే
కాఫీ ద్వారా అందే ఈ రక్షణ కేవలం కెఫిన్ వల్ల మాత్రమే రాదు. సాధారణ కాఫీతో పాటు కెఫిన్ తొలగించిన డీకాఫ్ కాఫీ కూడా కాలేయానికి అంతే మేలు చేస్తుంది. కాఫీలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ అయిన పాలిఫెనాల్స్ కాలేయ కణాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. డీకాఫ్ కాఫీ తాగే వారిలోనూ కాలేయ ఎంజైమ్‌లు మెరుగుపడినట్లు పలు పరిశోధనలు వెల్లడించాయి.

