Seed Cycling: సీడ్ సైక్లింగ్ అంటే ఏమిటి.. ఎలా చేయాలి
ఎలా చేయాలి

Seed Cycling: సీడ్ సైక్లింగ్ అంటే మహిళల హార్మోన్ల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా పీరియడ్స్ క్రమాన్ని మెరుగుపరచడానికి విత్తనాలను తినే ఒక సహజ పద్ధతి. ఈ పద్ధతిలో వివిధ విత్తనాలను పీరియడ్స్ సైకిల్‌లోని రెండు దశలలో తింటారు. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతిని పాటించడం వల్ల పీసీఓఎస్ (PCOS), థైరాయిడ్ సమస్యలు, పీరియడ్స్ నొప్పి వంటి హార్మోన్ల సమస్యలకు మంచి ఫలితాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఈ పద్ధతిని పీరియడ్స్ సైకిల్‌ను రెండు దశలుగా విభజించి పాటిస్తారు
ఫోలిక్యులర్ దశ : ఈ దశ పీరియడ్స్ మొదటి రోజు నుండి అండం విడుదలయ్యే (ovulation) వరకు ఉంటుంది. సాధారణంగా ఇది 1 నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ దశలో రోజుకు ఒక చెంచా గుమ్మడి గింజలు (Pumpkin Seeds), ఒక చెంచా అవిసె గింజలు (Flax Seeds) తినాలి. ఈ విత్తనాలలో లీగ్నాన్స్ అనే పదార్థాలు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అవిసె గింజలు అదనపు ఈస్ట్రోజెన్‌ను శరీరం నుంచి తొలగిస్తాయి.
ల్యూటియల్ దశ ; ఈ దశ అండం విడుదలైన తర్వాత పీరియడ్స్ ప్రారంభమయ్యే వరకు ఉంటుంది. సాధారణంగా ఇది 15 నుంచి 28 రోజుల వరకు ఉంటుంది. ఈ దశలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ దశలో రోజుకు ఒక చెంచా నువ్వుల గింజలు (Sesame Seeds), ఒక చెంచా పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) తినాలి.నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలలోని జింక్, విటమిన్-ఇ ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఈ విత్తనాలు హార్మోన్ల సమతుల్యతను కొనసాగించి, పీరియడ్స్ రాకను మెరుగుపరుస్తాయి.
