మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలు ఎంటీ?

Pregnant Women: గర్భం ధరించిన మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఎదుగుదల రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం వరకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. మలబద్ధకం సమస్యను నివారించడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఈ పోషకాలు బిడ్డ ఎదుగుదలకు చాలా అవసరం. డాక్టర్ సూచన మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలి. అపరిశుభ్రమైన ఆహారం, పచ్చి మాంసం, బాగా ఉడకని గుడ్లు, మరియు అధిక మొత్తంలో కెఫిన్ ఉన్న పానీయాలను దూరంగా ఉంచాలి. డాక్టర్ సలహా మేరకు నడక, యోగా వంటి మితమైన వ్యాయామాలు చేయాలి. ఇది శరీరానికి శక్తినిస్తుంది మరియు ప్రసవానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ 8-10 గంటల నిద్ర తప్పనిసరి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చివరి నెలల్లో, కుడి వైపు పడుకోవడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్లుగా అన్ని స్కాన్స్, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. డాక్టర్ సూచించిన మందులు, విటమిన్ సప్లిమెంట్స్ మాత్రమే వాడాలి. సొంతంగా ఎలాంటి మందులు వేసుకోకూడదు. ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ధ్యానం, యోగా, సంగీతం వినడం వంటివి ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడతాయి. గర్భధారణ సమయంలో బరువు పెరగడం సహజం. అయితే, అధిక బరువు పెరగకుండా జాగ్రత్త వహించాలి. మొదటి మూడు నెలలు, చివరి రెండు నెలల్లో ప్రయాణాలకు దూరంగా ఉండాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాలి. వదులుగా ఉండే, సౌకర్యవంతమైన బట్టలు ధరించాలి. ఎత్తైన చెప్పులు ధరించకుండా చదునైన చెప్పులు వాడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story