Lung Cancer Risk Drop After Quitting Smoking: ధూమపానం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని, ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే ఎంత కాలం స్మోక్ చేసినా, సిగరెట్ మానేసిన క్షణం నుంచే శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. సిగరెట్ మానేసిన తర్వాత శరీరంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో వైద్య నిపుణుల ఆధారంగా ఓసారి పరిశీలిద్దాం.

మొదటి కొన్ని రోజుల్లోనే స్పష్టమైన మార్పు

సిగరెట్ తాగడం ఆపిన కొద్ది రోజుల్లోనే రక్తంలో నికోటిన్ శాతం శూన్యానికి చేరుకుంటుంది. అంతేకాకుండా పొగ వల్ల శరీరంలో పెరిగిన కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు తగ్గి, సాధారణ స్థాయికి వస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.

నుండి 12 నెలల కాలంలో..

దగ్గు, శ్వాస సమస్యల తగ్గుదల

సిగరెట్ మానేసిన 1 నుండి 12 నెలల వ్యవధిలో నిరంతరం వేధించే దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది.

గుండెపోటు ముప్పు:

1 నుంచి 2 ఏళ్లలో గుండె సంబంధిత సమస్యలు మరియు గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

క్యాన్సర్ ముప్పు ఎప్పుడు తగ్గుతుంది?

5 నుండి 10 ఏళ్లలో:

పొగతాగడం మానేసిన 5 నుంచి 10 ఏళ్ల కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అదనపు ముప్పు క్రమంగా సగానికి తగ్గే అవకాశం ఉంది.

10 నుండి 15 ఏళ్లలో:

నిపుణుల ప్రకారం, ధూమపానం పూర్తిగా మానేసిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత, నిరంతరం స్మోకింగ్ చేసేవారితో పోలిస్తే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు దాదాపు 50 శాతం వరకు పడిపోతుంది.

15 ఏళ్ల తర్వాత ముప్పు పూర్తిగా పోతుందా?

15 ఏళ్లు పూర్తయినంత మాత్రాన ముప్పు పూర్తిగా సున్నా అయిపోదు. చాలా ఏళ్ల పాటు ఎక్కువగా స్మోక్ చేసిన వారిలో కొంతమేర ప్రభావం కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఎంత త్వరగా సిగరెట్ మానేస్తే, ఊపిరితిత్తులు అంత వేగంగా కోలుకుంటాయి.

ఇతర కారణాలు కూడా ముఖ్యం

లంగ్ క్యాన్సర్ ముప్పు కేవలం ధూమపానంతోనే ముడిపడి ఉండదు. సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ (ఇతరులు తాగే పొగను పీల్చడం), వాయు కాలుష్యం, రేడాన్ వాయువులు మరియు పని ప్రదేశాల్లోని హానికర రసాయనాలు కూడా దీనికి కారణం కావచ్చు. అయినప్పటికీ, ధూమపానం మానేయడమే ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైన తొలి అడుగు.

Next Story