ఎలా అలవాటు చెయ్యాలి.?

Babies Start Solid Food: పిల్లలకు ఘనాహారం (Solid foods) అలవాటు చేయడం అనేది ముఖ్యమైన దశ. సాధారణంగా, ఆరు నెలల వయస్సు నుండి దీనిని మొదలు పెట్టాలని వైద్యులు సూచిస్తారు.మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం

ఎప్పుడు, ఎలా మొదలు పెట్టాలి?

సమయం: శిశువుకు ఆరు నెలలు నిండిన తర్వాత మొదలు పెట్టడం ఉత్తమం. ఈ సమయంలో, తల్లిపాలలోని పోషకాలు సరిపోవు. ముఖ్యంగా ఐరన్,జింక్

సంకేతాలు : బిడ్డ తల, మెడపై నియంత్రణ కలిగి నిటారుగా కూర్చోగలగడం, ఆహారంపై ఆసక్తి చూపించడం ,నాలుకతో ఆహారాన్ని బయటికి నెట్టే ప్రతిచర్య తగ్గడం వంటి సంకేతాలు చూసి మొదలు పెట్టవచ్చు.

మొదటి ఆహారం: మొదట్లో, తక్కువ అలర్జీ కలిగించే, మెత్తగా పేస్ట్ లా చేసిన ఆహారాన్ని ఇవ్వాలి.

ఉదాహరణలు: మెత్తగా ఉడికించి చిదిమిన అరటిపండు అవొకాడో , ఉడికించిన కాయగూరల పేస్ట్ (క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్ వంటివి), లేదా తక్కువ పీచు పదార్థం (fiber) ఉన్న సెరల్స్ (Cereals).

ఎలా ఇవ్వాలి:

తల్లిపాలకు మధ్యలో: తల్లిపాలు ఇచ్చిన తర్వాత, మరలా పాలు ఇచ్చే సమయానికి మధ్యలో మెల్లగా ఘనాహారం అలవాటు చేయాలి. దీనివల్ల బిడ్డ పాలు తాగడం కొనసాగిస్తూనే, కొత్త ఆహారానికి అలవాటు పడతారు.

మొదట్లో పరిమాణం: రెండు లేదా మూడు చెంచాల మెత్తటి ఆహారంతో మొదలు పెట్టండి.

రోజుకు ఎన్నిసార్లు: 6-8 నెలల వయస్సులో రోజుకు 4 సార్లు అర కప్పు మృదువైన ఆహారం ఇవ్వవచ్చు.

చిక్కదనం (Consistency): ముందు పలచగా (జారుగా) ఇచ్చి, క్రమంగా చిక్కదనాన్ని పెంచుకుంటూ పోవాలి.

ఒకే ఆహారం: ఒకేసారి రెండు కొత్త పదార్థాలను కలపకుండా, ఒక్కొక్క కొత్త ఆహారాన్ని పరిచయం చేయండి. ఏదైనా అలర్జీ వస్తే, దేనివల్ల వచ్చిందో తెలుసుకోవడం సులభమవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story