Thyroid Test: థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటే
ఎప్పుడు చేయించుకోవాలంటే

Thyroid Test: థైరాయిడ్ టెస్ట్ ఉదయం తొమ్మిది గంటల్లోపు ఖాళీ కడుపుతో చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఏ సమయంలోనైనా పరీక్ష జరిగితే రిపోర్ట్ కరెక్ట్‌గా రాదు. రోగులు థైరాయిడ్ పరీక్షల కోసం వచ్చినప్పుడు మందులు తీసుకోకూడదు. రోగులు తమంతట తాముగా మందుల మోతాదు లేదా మొత్తాన్ని తగ్గించుకోకూడదు. అలాగే హైపర్ థైరాయిడిజం మందులను ఎప్పుడైనా తీసుకోవచ్చు. హైపోథైరాయిడిజం మందులు మాత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి థైరాయిడ్ గ్రంధి నుంచి హార్మోన్లు అధికంగా ఉత్పత్తైతే హైపర్ థైరాయిడ్, తక్కువగా ఉత్పత్తైతే హైపో థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ స్థాయిని సరిగ్గా నిర్వహించలేకపోతే అది గుండె, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉంటే థైరాయిడ్ ఉందని గమనించాలి. ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమతుల్యత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. హార్మోన్ల స్థాయిలలో తేడా వస్తే ప్రీమెచ్యూర్ డెలివరీ, బేబీ తక్కువ బరువుతో పుట్టడం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి గర్భిణీ శరీరానికి మాత్రమే కాకుండా శిశువు ఆరోగ్యానికీ ప్రమాదం. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకొని దానికి తగ్గట్లు మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.

