భర్త ఇలాంటి పనులు అస్సలు చేయకండి

Your Wife Is Pregnant, Husbands Must Avoid These Mistakes: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో భర్తగా ఆమెకు అండగా ఉండటం ఎంత ముఖ్యమో, కొన్ని పనులు చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఏడో నెల నుంచి భర్త క్షవరం చేయించుకోకూడదు. సముద్ర స్నానం, పడవ ప్రయాణం, పర్వతారోహణ వంటి సాహసాలు చేయకూడదు. శవయాత్రల్లో పాల్గొనడం, పిండదానాలు చేయడం వంటి అశుభ కార్యాలకు వెళ్లరాదు. గృహ నిర్మాణం, విదేశీ ప్రయాణాలు మానాలి. ఈ నియమాల ముఖ్య ఉద్దేశం భార్యకు మానసిక ప్రశాంతతనివ్వడం, పుట్టబోయే బిడ్డకు ఎటువంటి అరిష్టం కలగకుండా చూడటం. భార్య కోరికలు తీరుస్తూ ఆమెను సంతోషంగా ఉంచడమే భర్త ప్రధాన కర్తవ్యం.

1. ఆమె మాటలను లేదా మూడ్ స్వింగ్స్‌ను తక్కువ చేయకండి

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల ఆమె ఒక్కోసారి కోపంగా, మరోసారి బాధగా ఉండవచ్చు. "నువ్వు అనవసరంగా అతి చేస్తున్నావు" అని అనకండి. ఆమె భావాలను తక్కువ చేసి మాట్లాడకండి.ఓపికగా ఆమె మాటలు వినండి.

2. ఇంటి పనుల భారాన్ని ఆమెపైనే వదిలేయకండి

గర్భంతో ఉన్నప్పుడు ఆమె త్వరగా అలసిపోతుంది. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం లేదా బరువులు ఎత్తడం వంటి పనులు ఆమె చేత చేయించకండి. వంటలోనో, ఇల్లు సర్దడంలోనో మీరు సహాయం చేయండి.

3. ఆహారం,వాసనల విషయంలో నిర్లక్ష్యం వద్దు

గర్భిణీలకు కొన్ని వాసనలు పడవు (ఉదాహరణకు: తిరగమోత వాసన, పర్ఫ్యూమ్స్). ఆమెకు ఇష్టం లేని వాసనలు వచ్చేలా ప్రవర్తించకండి. ఆమె తినలేని ఆహారాన్ని బలవంతంగా పెట్టకండి.ఆమెకు ఏం తినాలని ఉందో అడిగి తెలుసుకోండి.

4. ఆమె శారీరక మార్పుల గురించి కామెంట్ చేయకండి

గర్భం వల్ల బరువు పెరగడం, ముఖంపై వాపు రావడం సహజం. "నువ్వు లావయ్యావు" లేదా "చూడటానికి బాగోలేదు" వంటి మాటలు సరదాకి కూడా అనకండి. ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.ఆమెను ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ, అందంగా ఉన్నావని చెబుతూ ఉండండి.

5. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి (ముఖ్యంగా ధూమపానం)

ఆమె దగ్గర సిగరెట్ తాగడం (సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) చాలా ప్రమాదకరం. ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండండి.

6. ఒంటరిగా వదిలేయకండి

ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కువ సేపు బయట గడపకండి. భయం లేదా ఆందోళన కలిగించే విషయాలు ఆమె ముందు మాట్లాడకండి. డాక్టర్ చెకప్స్ అన్నింటికీ ఆమెతో పాటు వెళ్ళండి.

7. నిద్రకు ఆటంకం కలిగించకండి

గర్భిణీలకు నిద్ర చాలా అవసరం. రాత్రిపూట ఫోన్ సౌండ్ చేయడం లేదా ఆలస్యంగా వచ్చి ఆమె నిద్రను పాడుచేయడం చేయకండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story