ఏ నూనె వాడాతే మంచిది?

Best Oil for Cooking: ప్రస్తుత జీవనశైలిలో మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అంశాల్లో వంట నూనె ముఖ్యమైంది. గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి విషయాల్లో మనం ఎంచుకునే నూనె కీలకపాత్ర పోషిస్తుంది. మార్కెట్‌లో రకరకాల నూనెలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో, ఏది మంచిది? ఏది ఎప్పుడు వాడాలి? అనే సందేహాలు సర్వసాధారణం. ఈ విషయంపై ఆహార నిపుణులు, కార్డియాలజిస్టులు అందిస్తున్న ముఖ్యమైన సలహాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.

నూనెను వేడి చేసినప్పుడు ఎప్పుడైతే పొగ రావడం మొదలవుతుందో, ఆ ఉష్ణోగ్రతను స్మోక్ పాయింట్ అంటారు. అధిక స్మోక్ పాయింట్ ఉన్న నూనెలు డీప్ ఫ్రై (గారెలు, బజ్జీలు) వంటి ఎక్కువ వేడి అవసరమయ్యే వంటకాలకు ఉత్తమం. తక్కువ స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను సలాడ్‌లపైనా, తక్కువ వేడి వంటకాలపైనా వాడాలి.

MUFA (మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్): గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె వీటిలో ఎక్కువగా ఉంటాయి.

PUFA (పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్): ఒమేగా-3, ఒమేగా-6 ఇందులో ముఖ్యమైనవి.

SFA (శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్): ఇవి ఎక్కువగా ఉంటే గుండెకు మంచిది కాదు. కొబ్బరి నూనె, పామాయిల్‌లో ఇవి ఎక్కువ.

ఏ ఒక్క నూనెనూ నిరంతరం వాడకుండా, ప్రతి 2-3 నెలలకోసారి వేరే నూనెను ఉపయోగించడం లేదా రెండు రకాల నూనెలను కలిపి వాడటం ద్వారా అన్ని రకాల ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలను (MUFA, PUFA) సమతుల్యంగా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ నూనె అయినా ఆరోగ్యానికి మంచిదే అయినా, రోజుకు 2-3 టేబుల్ స్పూన్లకు మించకుండా మితంగా వినియోగించడం ఆరోగ్యకరమైన జీవనశైలికి చాలా ముఖ్యం. నూనె ఎక్కువైతే ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story