ఏ పాత్రలో నీరు తాగితే మంచిది..?

Vessel: మానవ శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శరీర ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో, దానిని త్రాగే పాత్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సీజన్‌ను బట్టి వివిధ లోహాల పాత్రలలో నీరు త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఏ సీజన్‌లో ఏ పాత్రలో నీరు త్రాగడం మంచిదో కింద వివరించబడింది:

వేసవిలో మట్టి కుండ నీరు

చాలామంది ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి నీటిని తాగుతారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. దీనికి బదులుగా, మట్టి కుండలో నిల్వ చేసిన నీరు త్రాగడం ఉత్తమం. మట్టి కుండ నీటిని సహజంగా చల్లగా ఉంచడంతో పాటు, దానిలోని ఖనిజాలు నీటి నాణ్యతను పెంచుతాయి. ఉదయం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు తొలగిపోతాయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

శీతాకాలంలో బంగారు కుండ నీరు

శీతాకాలంలో శరీరానికి వెచ్చదనం, రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ సమయంలో బంగారు కుండలో నీరు త్రాగడం ఆరోగ్యకరం. ఒకవేళ బంగారు కుండ అందుబాటులో లేకపోతే, ఏదైనా పాత్రలోని నీటిలో బంగారు ఉంగరం లేదా ఇతర బంగారు వస్తువును వేసి ఆ నీటిని త్రాగవచ్చు. ఈ నీరు నిరాశ, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుంది.

వర్షాకాలంలో రాగి పాత్ర నీరు

వర్షాకాలంలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో రాగి పాత్రలోని నీరు త్రాగడం సురక్షితం. రాగి పాత్ర నీటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. రాగికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. రాత్రిపూట రాగి పాత్రలో ఉంచిన నీటిని ఉదయం తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story