లోపాలు ఎందుకు వస్తాయంటే.?

Birth Defects from Birth: శిశువుల్లో పుట్టుకతో వచ్చే లోపాలు (Birth Defects) రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఒకే ఒక కారణం కాకుండా, అనేక కారణాలు కలిపి ఈ లోపాలకు దారితీస్తాయి .జన్యుపరమైన,క్రోమోజోముల లోపాలు తల్లిదండ్రుల నుండి సంక్రమించే జీన్స్‌లో లోపాలు ఉండటం.క్రోమోజోముల సంఖ్యలో లేదా నిర్మాణంలో మార్పులు రావడం . ఎక్కువగా మేనరిక వివాహాలు, క్రోమోజోమ్స్‌ లోపం, మానసిక లోపాలు, సింగిల్‌ జీన్‌ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ, బ్యాడ్‌ అబ్‌స్ట్రెటిక్‌ హిస్టరీ, శృంగార సంబంధిత వ్యాధులు వల్ల ప్రధానంగా శిశువుల్లో లోపాలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు.

గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వచ్చే కొన్ని రకాల వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు (ఉదాహరణకు, రుబెల్లా, సైటోమెగలోవైరస్, జికా వైరస్, టాక్సోప్లాస్మోసిస్) పిండం అభివృద్ధిని దెబ్బతీయవచ్చు.

పర్యావరణ ,జీవనశైలి కారకాలు,గర్భధారణ సమయంలో వైద్యుల సలహా లేకుండా కొన్ని రకాల మందులు వాడటం. తల్లి గర్భధారణ సమయంలో మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు తీసుకోవడం.

కొన్ని రకాల విషపూరిత రసాయనాలు లేదా రేడియేషన్‌కు గురికావడం.

పోషకాహార లోపాలు

గర్భధారణకు ముందు,గర్భధారణ సమయంలో ముఖ్యమైన పోషకాలు, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ (Folic Acid) తగినంత తీసుకోకపోవడం వల్ల న్యూరల్ ట్యూబ్ లోపాలు (Neural Tube Defects) వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

విటమిన్ డి లేదా ఇతర ఖనిజాల లోపాలు.

తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యలు

గర్భధారణకు ముందు లేదా ఆ సమయంలో తల్లికి సరిగా నియంత్రణలో లేని మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు.తీవ్ర రక్తపోటు.ఈ లోపాలు కొన్నిసార్లు పూర్తిగా నివారించదగినవి కాకపోవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story