తలనొప్పి ఎందుకు వస్తుందంటే?

Get a Headache When You Skip Tea/Coffee: ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అయితే, ఒక రోజు అనుకోకుండా ఆ అలవాటును మానేస్తే లేదా ఆలస్యంగా తాగితే తక్షణమే తలనొప్పి రావడం గమనించే ఉంటారు. దీనికి కారణం మన శరీరానికి ఈ పానీయాల ద్వారా అందే ఒక శక్తివంతమైన రసాయనం – అదే కెఫీన్. వైద్య పరిభాషలో ఈ సమస్యను 'కెఫీన్ విత్‌డ్రాయల్ హెడేక్' అంటారు. కెఫీన్ విత్‌డ్రాయల్ తలనొప్పి రావడానికి ప్రధాన కారణం మన మెదడులోని రక్త నాళాలు వాటికి సంబంధించిన రసాయన చర్యలు.

కెఫీన్ ఒక వాసోకాన్‌స్ట్రిక్టర్ గా పనిచేస్తుంది. అంటే, ఇది మెదడులోని రక్త నాళాలను కొద్దిగా సంకోచించేలా చేస్తుంది. సాధారణంగా, ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. మీరు రెగ్యులర్‌గా తీసుకునే కెఫీన్‌ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడు, మెదడులోని రక్త నాళాలు వేగంగా వ్యాకోచిస్తాయి. ఈ ఆకస్మిక వ్యాకోచం చుట్టుపక్కల ఉన్న నాడులు, కణజాలాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడినే మన మెదడు తలనొప్పి లేదా మైగ్రేన్ లక్షణంగా గుర్తించి నొప్పిని ప్రేరేపిస్తుంది.

:

కెఫీన్ చర్యలో మరో ముఖ్యమైన భాగం ఎడినోసిన్. ఇది మెదడులో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక రసాయనం, ఇది మనల్ని నిద్ర వచ్చేలా చేసి, రక్త నాళాలను వ్యాకోచించేలా చేస్తుంది. కెఫీన్, ఈ ఎడినోసిన్ గ్రాహకాలను నిరోధిస్తుంది. అందుకే కాఫీ తాగగానే చురుకుగా అనిపిస్తుంది. మీరు కెఫీన్ తీసుకోవడం ఆపేస్తే, ఎడినోసిన్ గ్రాహకాలు ఒక్కసారిగా తెరుచుకుని, రక్త నాళాలను వ్యాకోచింపజేసి, నిద్ర లేమిని, తలనొప్పిని కలిగిస్తాయి.

రోజుకు కేవలం 100 మిల్లీగ్రాముల (ఒక కప్పు కాఫీ/రెండు కప్పుల టీ) కెఫీన్ తీసుకునే అలవాటు ఉన్నవారికి కూడా అకస్మాత్తుగా ఆపితే విత్‌డ్రాయల్ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఆగిపోయిన 12 నుండి 24 గంటల్లో ప్రారంభమై, ఒకటి నుండి రెండు రోజులు కొనసాగుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story