ఎందుకు తగ్గుతుందంటే?

Appetite Reduce in Children: పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్‌ పెట్టాలి. జంక్‌ ఫుడ్‌ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్‌ యాక్టివ్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పిల్లలు ఏదైనా ఆటలు ఆడించేలా ప్రోత్సహించండి. శారీరక శ్రమ ఉంటే వాళ్లకి ఎక్కువ ఆకలి వేస్తుంది. ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచండి. పిల్లలకు తగినంత నిద్ర కూడా ముఖ్యం. రాత్రి త్వరగా పడుకుని.. ఉదయం త్వరగా మేల్కొనేలా పిల్లలకు అలవాటు చేయండి. ఈ ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల పిల్లలు తినడానికి ఆసక్తి చూపుతారు. ఆహారంలో మార్పులు, పిల్లల దినచర్యను ప్లాన్ చేయడం ద్వారా సహజంగా ఆకలిని పెంచవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story