ఎందుకు చేయాలి.?

Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 2015 నుంచి ఏటా జూన్ 21న జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో యోగా చేస్తూ, దానిపై అవగాహనను పెంచుతూ ఉండడం ఈ రోజు ప్రత్యేకత. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ తేదీని.. సెప్టెంబర్ 27, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు . యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉనికి కాపాడుతుందని.. ఇది భారతదేశానికి బహుమతి లాంటిదని ఆయన కొనియాడారు.

యోగా వల్ల కలిగే ప్రయోజనాలు

మెరుగైన బలం, సమతుల్యత, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా అనేక ప్రయోజనాలనిస్తుంది. అంతే కాదు ఒత్తిడిని, ఆందోళనను, నిరాశను తగ్గించేందుకు, మెరుగైన నిద్రకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగాబలమైన కండరాల కోసంకండరాల బలోపేతం చేయడానికి యోగా సహాయపడుతుంది. యోగ భంగిమలతో సమతుల్యతను మెరుగుపరుస్తుంది.

మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా సహాయపడుతుంది.

యోగా శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది, ఫలితంగా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ప్రసరణను మెరుగుపరచడం, అలసటను తగ్గించడం ద్వారా శక్తి స్థాయిలను పెంచడానికి యోగా సహాయపడుతుంది.

కేలరీలను బర్న్ చేయడం, జీవక్రియను మెరుగుపరచడం వంటి వాడికి యోగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి కూడా యోగా సహాయపడుతుంది.

ఆందోళన, నిరాశ, ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story