రోజుకు ఎన్ని తినాలి..? ఎప్పుడు తినాలి..?

Winter Health Benefits of Pistachios: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ తీసుకునే అలవాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బాదం, వేరుశెనగ, పప్పులతో పాటు పిస్తాపప్పులు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవిగా నిపుణులు సూచిస్తున్నారు.

బరువు పెరుగుతారేమోనని కొందరు పిస్తాపప్పులు తినడానికి వెనుకాడుతున్నప్పటికీ, వాటిని సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పిస్తాపప్పులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పోషకాల గని: పిస్తాపప్పులు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి.

బరువు అదుపు: వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇతర ఆహారాలను మితంగా తినేలా చేస్తుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం: పిస్తాపప్పులు మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి.

వాపు సమస్య నివారణ: శరీరంలోని వాపు సమస్యను తొలగించడంలో కూడా పిస్తాపప్పులు సహాయపడతాయి.

రోజుకు ఎన్ని పిస్తాపప్పులు తినాలి?

పిస్తాపప్పులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఉదయం ఐదు నుండి ఏడు పిస్తాపప్పులు మాత్రమే తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజుకు ఏడు కంటే ఎక్కువ పిస్తాపప్పులు తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పిస్తాపప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి.

ప్పుడు తినడం ఉత్తమం?

పిస్తాపప్పులు నోటికి రుచిగా ఉన్నప్పటికీ, వాటిని ఎల్లప్పుడూ మితంగా తినడం మంచిది.

ఉదయం పూట పిస్తాపప్పులు తినడం ఉత్తమ సమయం. మధ్యాహ్నం లేదా సాయంత్రం తినడం కంటే ఉదయం వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story