Child’s Height and Weight Gain: పిల్లల ఎత్తు, బరువు పెరుగుదలపై టెన్షన్ పడుతున్నారా?
టెన్షన్ పడుతున్నారా?

Child’s Height and Weight Gain: పిల్లల ఎదుగుదల ప్రతి తల్లిదండ్రులకూ అత్యంత ముఖ్యమైన విషయమే! తమ పిల్లలు సరైన వయసుకు తగ్గట్టుగా ఎత్తు, బరువు పెరుగుతున్నారా లేదా అని ప్రతిరోజూ చాలా మంది తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. మరి పిల్లల ఎదుగుదల ఎలా ఉండాలి? ఏ వయసులో పిల్లల బరువు, ఎత్తు ఎంత ఉండాలి? ఈ విషయాలపై ప్రముఖ వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పుట్టిన బిడ్డ బరువు ఒక మోస్తరుగా ఉంటుంది. కానీ మొదటి ఏడాదిలో పిల్లల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పుట్టినప్పుడు ఉన్న బరువు మొదటి ఆరు నెలల్లో రెట్టింపు కావాలి, అలాగే మొదటి పుట్టినరోజు నాటికి సుమారు మూడు రెట్లు పెరగడం సాధారణం. అయితే ప్రతి బిడ్డ జన్యుపరమైన కారణాలు, పోషకాహారం , జీవన శైలిని బట్టి మారుతుంటారు కాబట్టి... పిల్లల మధ్య స్వల్ప తేడాలు ఉండటం సహజమే.
అయితే, కేవలం నంబర్స్ చూసి కంగారు పడకుండా... పిల్లల ఎదుగుదలలో కొన్ని కీలకమైన మైలురాళ్లను (Milestones) గమనించడం చాలా ముఖ్యం. వారు సరిగ్గా నడుస్తున్నారా, మాటలు నేర్చుకుంటున్నారా, చురుగ్గా ఉంటున్నారా లేదా అనేది గమనించాలి. ఒకవేళ మీ పిల్లలు వయసుకు తగ్గట్టుగా అస్సలు పెరగకపోవడం, లేదా బరువు విపరీతంగా తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఇలాంటి సమయంలో మీంతట మీరే ఎలాంటి మందులు లేదా సప్లిమెంట్స్ వాడకుండా, వెంటనే ఒక నిపుణులైన పిల్లల వైద్యుడిని (Pediatrician) సంప్రదించడం అత్యంత ముఖ్యం. డాక్టర్ల సలహా మేరకు సరైన పోషకాహారాన్ని అందిస్తూ, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఎదుగుతారు,

