వాకింగ్ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Benefits of Reverse Walking: రోజూ నడవడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో రివర్స్ వాకింగ్ బాగా పాపులర్ అవుతోంది. ఇది సరదా కోసం చేసే వ్యాయామం మాత్రమే కాదు.. దీనికి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెనుకకు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కండరాలను బలోపేతం చేస్తుంది: సాధారణ నడకతో పోలిస్తే రివర్స్ వాకింగ్ కండరాలను మరింత చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ఈ వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏకాగ్రతను పెంచుతుంది: వెనుకకు నడవడానికి ఎక్కువ శ్రద్ధ అవసరం. ఈ వ్యాయామం ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. పడిపోయే భయాన్ని తగ్గించి, మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. ఇది విద్యార్థులకు కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇది ప్రజలను మానసికంగా బలంగా చేస్తుంది.

గుండె ఆరోగ్యం - బరువు నియంత్రణ: ముందుకు నడవడం కంటే వెనుకకు నడవడం వల్ల గుండె స్పందన రేటు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వేగంగా కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మీ సాధారణ నడకకు అదనంగా, రివర్స్ వాకింగ్‌ను కూడా కొద్దిసేపు ప్రయత్నించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story