5 Common Kitchen Spices: మన వంటగది కేవలం రుచికరమైన వంటలు చేసుకునే స్థలం మాత్రమే కాదు... అదొక అద్భుతమైన ఆరోగ్య నిలయం. మనం ప్రతిరోజూ వాడే మసాలాలు వంటల రుచిని పెంచడమే కాకుండా, మన శరీరానికి కొండంత బలాన్ని ఇస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు మనల్ని సహజంగానే ఆరోగ్యంగా ఉంచుతాయి. మనకు ఎంతో మేలు చేసే 5 ముఖ్యమైన వంటగది మసాలాలు, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం.

1. పసుపు – సహజ నివారణి:

పసుపు శుభకార్యాలకే కాదు, ఆరోగ్యానికి కూడా పసుపే మొదటి ప్రాధాన్యత. పసుపులో 'కర్కుమిన్' అనే అత్యంత శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వచ్చే నొప్పులను, వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధం. అంతేకాదు, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపు ఎంతో తోడ్పడుతుంది.

2. అల్లం – జీర్ణక్రియకు తోడు:

అల్లం. అల్లం మన జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం వంటి సమస్యలను ఇది క్షణాల్లో తగ్గిస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు అల్లం టీ తాగితే శ్వాస సులభంగా ఆడుతుంది. కండరాల నొప్పులను తగ్గించడంలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది.

3. జీలకర్ర – సులభంగా అరిగించే శక్తి:

జీలకర్ర పేరుకు తగ్గట్టే ఇది జీర్ణశక్తిని అద్భుతంగా పెంచుతుంది. ఎంతటి భారీ భోజనం తిన్నా సరే, వంటల్లో జీలకర్ర ఉంటే అది సులభంగా అరిగిపోతుంది. కడుపులో గ్యాస్ చేరకుండా చూసే గుణం దీనికి సొంతం.

4. దాల్చినచెక్క – చక్కెరకు చెక్:

దాల్చినచెక్క కేవలం బిర్యానీలోనే కాదు... పానీయాలలో, ఓట్స్ వంటి ఆహారాలపై దీని పొడిని చల్లుకుని తీసుకుంటే ఎంతో మంచిది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్, అంటే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే మన శరీర జీవక్రియను, అంటే మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

5. నల్ల మిరియాలు – పోషకాల రారాజు:

నల్ల మిరియాలు ఇందులో 'పైపెరిన్' అనే ముఖ్య సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది... మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం త్వరగా గ్రహించేలా చేస్తుంది. ముఖ్యంగా, పసుపుతో కలిపి నల్ల మిరియాలను తీసుకున్నప్పుడు... పసుపులో ఉండే గుణాలను మన శరీరం రెండు వేల శాతం ఎక్కువగా వాడుకోగలుగుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story