Mistakes While Washing Your Face: ముఖం కడుక్కునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?
ఈ తప్పులు చేస్తున్నారా?

Mistakes While Washing Your Face: చాలామంది పదేపదే ముఖం కడుక్కోవడం, రకరకాల క్రీములతో మసాజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే, తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం మెరిసిపోవడం పక్కన పెడితే.. ఉన్న కాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది.
1. చేతులు కడుక్కోవడం మర్చిపోకండి:
చాలామంది చేసే మొదటి తప్పు.. నేరుగా ముఖంపై నీళ్లు చల్లుకోవడం. ముఖం కడుక్కునే ముందు మీ చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మీ చేతులకున్న మురికి, బ్యాక్టీరియా ముఖ చర్మంపైకి చేరి మొటిమలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
2. డ్రై స్కిన్ ఉన్నవారు సబ్బుకు దూరంగా ఉండాలి:
మీది పొడి చర్మమా? అయితే ముఖానికి సబ్బును అస్సలు వాడకండి! సబ్బులో ఉండే కెమికల్స్ మీ చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. దీనికి బదులుగా తేనె, అరటిపండు మిశ్రమంతో మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. డాక్టర్ల సలహా మేరకు మంచి ఫేస్ వాష్ ఎంచుకోవడం, తరచూ మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు.
3. క్లెన్సర్లు, స్క్రబ్‌ల అతి వినియోగం వద్దు:
చర్మం శుభ్రపడాలని క్లెన్సర్లు, స్క్రబ్‌లు ఎక్కువగా వాడుతున్నారా? అతిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ సిద్ధమైన మెరుపు పోయి, ముఖం నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి వీటిని పరిమితంగానే వాడండి.
4. నీటి ఉష్ణోగ్రత ముఖ్యం:
ముఖం కడుక్కోవడానికి అతి చల్లని నీళ్లు లేదా మరీ వేడిగా ఉండే నీళ్లను వాడకూడదు. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడమే చర్మానికి అత్యంత ఉత్తమం.

